Home / natu natu song
నాటు నాటు.. ఆర్ఆర్ఆర్ లోని ఈ పాట సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సినీ రంగంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ ని సాధించిన విషయం తెలిసిందే. తెలుగు వారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఇండియన్ గర్వపడేలా చేసిన ఈ సాంగ్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. సినిమా రిలీజయి సంవత్సరం అవుతున్నా కూడా నాటు నాటు అంటూ అందరూ ఊగిపోతూనే ఉన్నారు.
యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న సినిమా "దాస్ కా ధమ్కీ". ఇందులో నివేతా పేతురాజ్ హీరోయిన్. ఈ సినిమా పాన్ ఇండియన్ రేంజ్ లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు మూవీ ప్రమోషన్స్ లో జోరు పెంచారు.
సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు వేడుకలను సర్వం సిద్దమైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో మరికొన్ని గంటల్లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ ఏడాది జరగనున్న 95వ ఆస్కార్ వేడుకలు ఇండియన్ ఆడియన్స్ కు ప్రత్యేకం కాబోతున్నాయి. ఇవి మనకు ఎందుకు ప్రత్యేకమో అందరికీ తెలిసిందే.
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించింది. ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించారు. అలానే ఈ మూవీలో అజయ్ దేవ్గన్, శ్రియా శరణ్, ఆలియా భట్లు కీలక పాత్రల్లో కనిపించారు.
చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే "ఆస్కార్" అవార్డు ప్రధానోత్సవం వేడుకలు అమెరికాలో జరగబోతున్నాయి. ప్రతి ఏడాది సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభ కనబరిచిన నటీనటులకు, సినిమాలకు ఈ అవార్డులను అందజేస్తారు. ఈ ఏడాది జరగనున్న 95వ ఆస్కార్ వేడుకలు ఇండియన్ ఆడియన్స్ కు ప్రత్యేకం కాబోతున్నాయి. ఇవి మనకు ఎందుకు ప్రత్యేకమో అందరికీ తెలిసిందే.
భారతదేశం గర్వించదగ్గ సినిమాలలో "ఆర్ఆర్ఆర్" కూడా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించారు. అలానే ఈ మూవీలో అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవ్గన్, శ్రియా శరణ్, కీలక పాత్రల్లో కనిపించారు. 2022 మార్చి 24న రిలీజ్ అయిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా రికార్డులను తిరగరాసింది.
RRR‘ చిత్రంలోని నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించింది .ఈ పాపులర్ సాంగ్‌కి అనుగుణంగా పలువురు సెలబ్రిటీలు కూడా కాలు కదపడం ప్రారంభించారు
దేశంలోనే తొలిసారి హైదరాబాద్ వేదికగా జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ ఘనంగా ముగిసింది. ఈ ఫ్రీక్స్ రేసింగ్ కు క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, శిఖర్ ధావన్, దీపక్ హుడా, యజువేంద్ర చాహల్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ రేస్‌ను తిలకించారు.
దర్శకధీరుడు రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన నేపధ్యంలో రాజమౌళి స్పందించారు.
సినిమాలకు సంబంధించి అత్యుత్తమ పురస్కారం అంటే ముక్త కంఠంతో చెప్పే మాట ఆస్కార్. ఈ అవార్డు కోసం ప్రతి సినిమా వాళ్ళు కలలు కంటారు. ఈ అవార్డు నామినేషన్స్ కి ఇండియా నుంచి సినిమాలు వెళ్లడం చాలా అరుదు.