Last Updated:

Young Tiger NTR : విశ్వక్ ఒక ఎనర్జీ బాల్.. అభిమానులందరికి ఎప్పటికీ ఋణపడి ఉంటా – ఎన్టీఆర్

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న సినిమా "దాస్ కా ధమ్కీ". ఇందులో నివేతా పేతురాజ్ హీరోయిన్. ఈ సినిమా పాన్ ఇండియన్ రేంజ్ లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు మూవీ ప్రమోషన్స్ లో జోరు పెంచారు.

Young Tiger NTR : విశ్వక్ ఒక ఎనర్జీ బాల్.. అభిమానులందరికి ఎప్పటికీ ఋణపడి ఉంటా – ఎన్టీఆర్

Young Tiger NTR : యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న సినిమా “దాస్ కా ధమ్కీ”. ఇందులో నివేతా పేతురాజ్ హీరోయిన్. ఈ సినిమా పాన్ ఇండియన్ రేంజ్ లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు మూవీ ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చి సందడి చేశారు.

కాగా ఆస్కార్ గెలిచాక మొదటి సారి మీడియా ముందుకు ఎన్టీఆర్ రావడంతో అభిమానులు ఈ ఈవెంట్ కి భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఇవాళ ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ దక్కించుకుంది అంటే.. దానికి రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, రాహుల్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ ఎంత కారణమో వారితో పాటు తెలుగు చలన చిత్రసీమ, భారత చిత్రసీమ, భారతదేశపు ప్రేక్షకులు కూడా అంతే కారణం. కీరవాణి, చంద్రబోస్ గారిని ఆ స్టేజి మీద చూడడానికి నాకు రెండు కళ్ళు సరిపోలేదు. పైగా అక్కడ నాకు వారిద్దరూ కనపడలేదు. ఇద్దరు భారతీయులు, ఇద్దరు తెలుగు వాళ్ళు మాత్రమే కనపడ్డారు. నేను లైవ్ లో చూశాను, ఆ మూమెంట్ ఎప్పటికి గుర్తుండిపోద్ది. ఆర్ఆర్ఆర్ సినిమా ఇచ్చిన స్పూర్తితో తెలుగు సినిమాలు మరింత ముందుకు వెళ్ళాలి. భవిష్యత్తులో తెలుగు సినిమాలు మరిన్ని విజయాలు సాధించాలి అని అన్నారు.

అలాగే విశ్వక్ సేన్ గురించి మాట్లాడుతూ (Young Tiger NTR) ..

అతను ఒక ఎనర్జీ బాల్ .. ఆయనలా మైకులో నేను మాట్లాడలేను. నేనే అంటే ఆయన నాకంటే ఎక్కువగా మాట్లాడతాడు. మనసు బాగోలేనప్పుడు నేను చూసే సినిమాల్లో ‘ఈ నగరానికి ఏమైంది’ ఒకటి అని అన్నారు. నటుడిగా, దర్శకుడిగా విశ్వక్ లో నాకు నచ్చింది కాన్ఫిడెన్స్. ఒక చట్రంలోకి వెళ్లిపోతున్నాడేమో అని నేను అనుకుంటున్న సమయంలో ఆయన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా చేశాడు. పాత్ర కోసం ఆయన మారిపోయిన తీరు చూస్తే నాకే ఆశ్చర్యమేసింది. తను చాలా పరిణతిని సాధించాడనిపించింది. అలా మారిపోవడానికి నాకే చాలా సమయం పట్టింది” అని చెప్పారు.

కానీ నటుడిగా నాకు తెలుసు విశ్వక్ కి ఇంత తక్కువ ఏజ్ లోనే బాగా చేస్తున్నాడు. తనకు తాను సక్సెస్ అవ్వడానికి బయలుదేరాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి. విశ్వక్ ఈ సినిమా తర్వాత దర్శకత్వం ఆపేయాలి. చాలా మంది దర్శకులు ఉన్నారు తెలుగులో. వాళ్ళు మనతో సినిమాలు చేస్తారు. నువ్వు నటుడిగా చాలా సినిమాలు చేయాలి. మనలాంటి నటులు అందరూ కలిసి తెలుగు పరిశ్రమని పడనివ్వకూడదు. ఇంకా ముందుకి తీసుకెళ్లాలి. నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఉన్నదంతా ఈ సినిమాకు పెట్టేశాను అని అడిగితే నాకు బాధ వేసింది. కానీ అది సినిమా మీద ఉన్న పిచ్చి. ఇలాంటి వాళ్ళే సినిమాలని ముందుకు తీసుకెళ్తారు. అందుకే ఎంకరేజ్ చేస్తున్నాను. ఉగాదికి విశ్వక్ కి కూడా ఈ సినిమా హిట్ కొట్టి పండగ చేసుకోవాలి. అభిమానులందరికి రుణపడి ఉంటాను అని అన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.