Last Updated:

Oscar Awards Ott Streaming : ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ఆస్కార్ అవార్డు వేడుక.. ఎందులో అంటే?

చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే "ఆస్కార్" అవార్డు ప్రధానోత్సవం వేడుకలు అమెరికాలో జరగబోతున్నాయి. ప్రతి ఏడాది సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభ కనబరిచిన నటీనటులకు, సినిమాలకు ఈ అవార్డులను అందజేస్తారు. ఈ ఏడాది జరగనున్న 95వ ఆస్కార్ వేడుకలు ఇండియన్ ఆడియన్స్ కు ప్రత్యేకం కాబోతున్నాయి. ఇవి మనకు ఎందుకు ప్రత్యేకమో అందరికీ తెలిసిందే.

Oscar Awards Ott Streaming : ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ఆస్కార్ అవార్డు వేడుక.. ఎందులో అంటే?

Oscar Awards Ott Streaming : చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే “ఆస్కార్” అవార్డు ప్రధానోత్సవం వేడుకలు అమెరికాలో జరగబోతున్నాయి. ప్రతి ఏడాది సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభ కనబరిచిన నటీనటులకు,  సినిమాలకు ఈ అవార్డులను అందజేస్తారు. ఈ ఏడాది జరగనున్న 95వ ఆస్కార్ వేడుకలు ఇండియన్ ఆడియన్స్ కు ప్రత్యేకం కాబోతున్నాయి. ఇవి మనకు ఎందుకు ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ఈసారి ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ సినిమా ఉండటం.. ఆస్కార్ వేదికపై మన తెలుగు సింగర్ల పెర్ఫామెన్స్ లు కూడా ఉండటంతో ఆస్కార్ వేడుకలపై ఇండియన్స్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ ఉత్సాహం చూపిస్తున్నారు.

ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల వేడుకలకు ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు అమెరికాకు బయలుదేరుతున్నారు. ఇప్పటికే మన టాలీవుడ్ నుంచి దర్శకధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ అమెరికా పర్యటనలో ఉండగా.. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం అమెరికాకు చేరుకున్నారు. ఆస్కార్ బరిలో మన తెలుగు చిత్రం ఆర్ఆర్ఆర్ నిలవడంతో భారతీయులు అంతా ఆస్కార్ అవార్డ్ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే కాదు.. లైవ్ ప్రోగ్రామ్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందా అని వెతకడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఆస్కార్ వేడుకల వేదిక నుంచి లైవ్ ఓటీటీలో కూడా అవ్వబోతున్నట్టు సమాచారం. ఇందుకోసం ప్రముఖ ఓటీటీ సంస్థతో ఒప్పందం కుదుర్చున్నట్లుగా తెలుస్తుంది.

In what order are the Oscar awards presented? - Quora

ఏ ఓటీటీలో? ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది అంటే ?? (Oscar Awards Ott Streaming)

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఆస్కార్ అవార్డ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని హాట్ స్టార్ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. మార్చి 13న ఉదయం 5.30 గంటల నుంచి హాట్ స్టార్ ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు మేకర్స్. దీంతో ఆస్కార్ ఈవెంట్స్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆస్కార్ వేడుక వచ్చే ఆదివారం మార్చి 12న సోమవారం తెల్లవారుజామున జరగనుంది. ఆర్ఆర్ఆర్ ఎలాగైనా ఆస్కార్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. మేకర్స్ తో పాటు భారతీయ ప్రేక్షకులంతా నాటునాటు సాంగ్ కు ఆస్కార్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.

అయితే ఇంతటి హిట్ సాధించిన ఈ సినిమాను ప్రభుత్వం ఆస్కార్ కి పంపించకపోవడం బాధాకరం అనే చెప్పాలి. అయినప్పటికీ ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈ  సినిమాను ఆస్కార్ నామినేషన్ వరకూ తీసుకెళ్లాడు దర్శకుడు రాజమౌళి. ఆస్కార్ అవార్డుల వేడుక పై నాటు నాటు సాంగ్ ని సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగుంజ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. అంతే కాదు నాటు నాటు సాంగ్ ను ఎన్టీఆర్, తారక్ కలిసి లైఫ్ లె పెర్ఫామెన్స్ ఇవ్వబోతున్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. చూడాలి మరి ఈసారి ఆస్కార్ .. తెలుగు వారికి మరువలేని గౌరవాన్నిఅందిస్తుందా లేదా అని..

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/