Last Updated:

Rajamouli : ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు సారీ చెప్పిన రాజమౌళి.. కారణం ఏమిటో తెలుసా?

దర్శకధీరుడు రాజమౌళి చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ అవార్డుకు నామినేట్‌ అయిన నేపధ్యంలో రాజమౌళి స్పందించారు.

Rajamouli : ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు సారీ చెప్పిన రాజమౌళి.. కారణం ఏమిటో తెలుసా?

Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ అవార్డుకు నామినేట్‌ అయిన నేపధ్యంలో రాజమౌళి స్పందించారు.
ఈ మేరకు సోషల్ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. రాజమౌళి పోస్టు ఈ విధంగా ఉంది.

ఇంతకంటే ఇంకేం కావాలి? ..రాజమౌళి

నా సినిమాలో మా పెద్దన్న (కీరవాణి) తన పాటకు గాను ఆస్కార్ నామినేషన్ పొందారు. ఇంతకంటే ఇంకేం కావాలి? అలుపెరగకుండా, పని రాక్షసుడిలా వ్యవహరించిన కార్తికేయ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. నీ పట్ల గర్విస్తున్నాను కార్తికేయ. ఇప్పుడు నేను తారక్, చరణ్‌ల కంటే ఫాస్ట్‌గా నాటు నాటు పాటకు డ్యాన్స్‌ చేస్తున్నా.చంద్రబోస్ గారూ కంగ్రాచ్యులేషన్స్.. ఆస్కార్ వేదిక మీద మన పాట వినిపిస్తోంది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్.. ఈ పాట కోసం మీ కృషి అమూల్యం. మీకు నా వ్యక్తిగత ఆస్కార్ ఇచ్చేస్తాను. ఈ పాటకు సంబంధించి నాకు భైరవ బీజీఎం ఎంతో భరోసా అందించింది.

వారిద్దరి వల్లే పాటకు ఈ పేరు వచ్చింది.. రాజమౌళి

ఈ పాట ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణంఎన్టీఆర్, రామ్ చరణ్ తమదైన శైలిలో వారు చేసిన డ్యాన్స్. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకింది.అయితే, ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ వేళ నేను పెట్టిన టార్చర్‌కు వారిద్దరినీ క్షమాపణలు కోరుతున్నా. చాన్స్ దొరికితే వాళ్లిద్దరినీ మరోసారి ఆడుకోవడానికి నేను రెడీ. అసలు నేనెప్పుడూ ఆస్కార్ వరకు వెళతానని అనుకోలేదు.

ఆర్ఆర్ఆర్‌ అభిమానులవల్లే ఇది సాధ్యమయింది.. రాజమౌళి

నాటు నాటు పాటకు, ఆర్ఆర్ఆర్‌కు ఉన్న అభిమానుల వల్లే సాధ్యమైంది. వారి అభిమానం చూసిన తర్వాత ఈ పాటను ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన మా మనసుల్లో కలిగింది. వీరాభిమానులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ఇక సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్, నాటు నాటు పాటకు ప్రచారం కల్పించడంలో నిరంతరం కృషి చేసిన ప్రదీప్, హర్ష, చైతన్యలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఆస్కార్‌కు మరొక్క అడుగుదూరంలో ఉన్నాం.. థాంక్యూ!’ అంటూ రాజమౌళి ఎమోషనల్‌ అయ్యారు.

 

ఆస్కార్ నామినేషన్స్ లో నాటునాటు సాంగ్

95వ ఆస్కార్ నామినేషన్స్ లో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటు సాంగ్ చోటు దక్కించుకోవడం పట్ల తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నాుర.

సినిమా రంగంలో అత్యుత్తమ అవార్డుగా ఆస్కార్ ను పరిగణిస్తారు. ఇది సినిమా రంగంలో అత్యున్నతమైన అవార్డ్.

ప్రపంచంలో సినిమా తీసే ప్రతి ఒక్కరు ఈ అవార్డు కోసం కలలు కంటారు. కొన్ని సినిమాలు ఈ నామినేషన్స్ లో నిలిచిన చాలు అనుకుంటారు.

అయితే ఈ ఏడాది అస్కార్ నామినేషన్స్ భారతీయులకి ఆసక్తిగా మారింది. దానికి కారణం.. దర్శకధీరుడు తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్.

ప్రపంచం మొత్తం మన తెలుగు సినిమాను మెచ్చుకుంది.

అయితే ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలుస్తుందా అని భారతీయులు ఎదురు చూస్తున్న నిరీక్షణకు తెరపడంది.

ఇప్పటికే ఆస్కార్ కు క్వాలిఫై లిస్ట్ లో పలు ఇండియన్ సినిమాలు నిలిచాయి.

ఆస్కార్ నామినేషన్స్ లో మాత్రం ఆర్ఆర్ఆర్, చెల్లో షో, ఆల్ దట్ బ్రీత్స్ సినిమాలకు చోటు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

తెలుగు ప్రేక్షకులు మాత్రం.. ఆర్ఆర్ఆర్ RRR తప్పకుండా ఆస్కార్ బరిలో నిలుస్తుందని భావించారు. అదే నిజమైంది.

ఇప్పటికే ఈ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు.. హాలీవుడ్ అవార్డులు గెలుచుకుంది.

ఆర్ఆర్ఆర్ అభిమానులు, ఇండియన్ ప్రేక్షకులు నామినేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/