Home / national news
గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు ఆయన కుమార్తె రోహిణి ఆచార్య తన కిడ్నీల్లో ఒకదానిని దానం చేయాలని నిర్ణయించుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురి ఇళ్లు, ఆఫీసులపై ఈడీ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈడీ మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ రెడ్డితో పాటు వినయ్ బాబును అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు.
జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో 17 మంది గాయపడ్డారు.
ఇటీవల కాలంలో వరుస భూకంపాలు ప్రపంచంలోని ఏదో ఒకదగ్గర ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి. తాజాగా అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున పోర్ట్‌బ్లేయిర్‌లో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ అధికారులు వెల్లడిస్తున్నారు. రిక్టర్‌స్కేలుపై 4.3గా భూకంప తీవ్రత నమోదయిందని పేర్కొంటున్నారు.
భీమా కోరెగావ్ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవినీతిపరులే దేశాన్ని నాశనం చేస్తున్నారని వ్యాఖ్యానించింది.
పశ్చిమ బెంగాల్‌లోని ఒక మారుమూల గ్రామంలో రోడ్డుకు గ్రామ పాఠశాలలో చదివి, పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్ది పేరు పెట్టారు. న్యూజల్పాయ్ గురిలోని ఒక మారుమూల గ్రామమైన దోష్ దర్గాలో రాబోయే మూడు కిలోమీటర్ల రహదారికి జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు దులాల్ దేబ్నాథ్ సోమవారం రోడ్డుకు శంకుస్థాపన చేసారు.
తమిళనాడు వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో(సీఎంసీ) సీనియర్లు జూనియర్లతో చాలా దారుణంగా ప్రవర్తించారు. ర్యాగింగ్ పేరుతో సీనియర్లు చేసిన పని పలువురిని షాక్ కి గురి చేసింది. బట్టలు విప్పించి మరీ వారి పట్ల పైశాచికంగా ప్రవర్తించారు.
భార్యాభర్తలన్నాక గొడవలు సహజం. కొన్నిసార్లు చిన్నచిన్న విషయాలే పెద్ద ఘర్షణలకు తావిస్తాయి. అయితే అక్కడ ఎవరు క్షణికావేషానికి లోనైనా కానీ భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇలాంటి కోవకు చెందిన ఘటనే చైన్నైలో ఒకటి చోటుచేసుకుంది. బిర్యానీ విషయంలో వృద్ధ దంపతుల మధ్య చెలరేగిన తగాదా భార్యకు నిప్పంటించేలా చేసింది. మరి ఈ ఘటన ఎక్కడ ఎప్పుడు జరిగిందో చూసేద్దాం.
గుజరాత్‌లోని గాంధీనగర్ మరియు మహారాష్ట్రలోని ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కు వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
మనీ లాండరింగ్ కేసులో మూడున్నర నెలలుగా జైలులో ఉన్న ఫైర్ బ్రాండ్, శివసేన ఉద్ధవ్ ధాకరే పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ కు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.