Home / Loksabha Elections 2024
CEC Rajiv kumar: భారతీయ ఎన్నికలు ఓ అద్భుతమని ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్‌కుమార్ సోమవారం నాడు అన్నారు. మంగళవారం నాడు కౌంటింగ్ జరుగనున్న నేపథ్యంలో ఆయన న్యూఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 642 మిలియన్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది ఓ చారిత్రక రికార్డు అని ఆయన అన్నారు.
: లోకసభ ఎన్నికల తర్వాత కేంద్రంలో పగ్గాలు చేపట్టేంది బీజేపీనే అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే పలు మార్లు చెప్పారు. అదే కోవలో యోగేంద్ర యాదవ్ కూడా కేంద్రంలో బీజేపీనే అధికారం చేపట్టబోతోందన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహారాష్ర్టలో సుడి గాలి పర్యటన చేస్తున్నారు. లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం ఉత్తర మహారాష్ర్ట లోని నందుర్బార్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
గతంలోని బలహీనమైన కాంగ్రెస్ ప్రభుత్వం టెర్రరిజాన్ని అణిచి వేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. జార్ఖండ్‌లో శనివారం నాడు ఆయన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. పొరుగు దేశంతో శాంతి కోసం వెంపర్లాడేందుకు ప్రేమ లేఖలు పంపించేది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే దీనికి బదులుగా పాకిస్తాన్ దేశంలోకి పెద్ద ఎత్తున టెర్రరిస్టులను పంపి అమాయకులను ఊచకోత కోసేది.