Heavy Rains : ఏపీకి భారీవర్ష సూచన
ఏపీలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ మేరకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
AP Rain Alert: ఏపీలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ మేరకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశముంది. ఈనెల 8నాటికి అల్పపీడనంగా మారి తమిళనాడు, పుదుచ్చేరి తీరాన్ని తాకుతుందని IMD పేర్కొంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పడే అవకాశముంది. వర్షాలతోపాటు టెంపరేచర్ పడిపోయి చలి పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అల్పపీడనం ఎఫెక్ట్ తమిళనాడు, పుదుచ్చేరిని తాకుతుందని.. ఆ తర్వాత ఏపీకి చేరుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల విస్తారంగా, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి.