Home / latest sports news
E Racing: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ -రేసింగ్ లో గందరగోళం నెలకొంది. దీంతో ఈ రేస్ ఆలస్యంగా ప్రారంభమైంది. సాధారణ వాహనాలు ఒక్కసారిగా.. ట్రాక్ పైకి రావడంతో 45 నిమిషాల పాటు రేసింగ్ కు అంతరాయం ఏర్పడింది. వాహనాలను తొలగించడంతో తిరిగి రేసింగ్ ప్రారంభమైంది.
IND vs AUS Test: నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పై చేయి సాధించింది. ప్రస్తుతం టీమిండియా 144 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఓ దశలో రెండో రోజు ఆసీస్ పై చేయి సాధించేలా కనిపించినా.. చివరికి బ్యాటర్లు రాణించండంతో భారత్ మెరుగైన స్కోర్ సాధించింది. మెుదట్లో వికెట్లు కోల్పోయిన భారత్.. చివర్లో పట్టుదలతో రాణించింది. చివర్లో జడేజా, అక్షర్ బ్యాటింగ్ తో భారత్ భారీ ఆధిక్యంలోకి వెళ్లింది.
Rohit Sharma: బోర్డర్- గవాస్కర్ ట్రోఫిలో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ.. మరో రికార్డును సొంతం చేసుకున్నారు. భారత్ క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్ కు సాధ్యం కాని రికార్డును రోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు. నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆటలో రోహిత్ ఈ రికార్డును అందుకున్నాడు.
క్రికెట్ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మ్యాచ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫి. ఈ టోర్నీ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనలే లక్ష్యంగా టీమిండియా మైదానంలోకి దిగుతుంటే..
Aaron Finch: అంతర్జాతీయ క్రికెట్‌కు అస్ట్రేలియా ఓపెనర్.. ఆరోన్ ఫించ్ వీడ్కోలు పలికాడు. ఇది వరకే వన్డే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఈ స్టార్ ఓపెనర్.. తాజాగా టీ 20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాకు తొలి టీ20 ప్రపంచకప్‌ను అందించిన సారథిగా ఫించ్ ఘనత సాధించాడు.
Border Gavaskar Trophy: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ.. ఈ పేరు క్రికెట్లో చాల ప్రత్యేకమైనది. ఈ సిరీస్ రెండు జట్లకు అత్యంత కీలకమైనది. ఈ సిరీస్ వచ్చిందంటే చాలు.. క్రికెట్ అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్కంఠ నెలకొంటుంది. మరి ఈ సిరీస్ కు ఈ పేరేలా వచ్చింది. ఆస్ట్రేలియా- భారత్ మధ్యే ఈ సిరీస్ ఎందుకు జరుగుతుంది.
Ashwin: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. అరుదైన మైలురాయికి అడుగు దూరంలో ఉన్నాడు. మరో ఒక్క వికెట్ తీస్తే.. రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం టెస్టుల్లో.. 449 వికెట్లు పడగొట్టాడు. మెుత్తం ఇప్పటివరకు 88 మ్యాచులు ఆడిన అశ్విన్.. 449 వికెట్లతో మరో రికార్డుకు దగ్గరయ్యాడు.
Indian cricketers: భారత్ క్రికెటర్లు.. మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యారు. కొందరు నెటిజన్లు.. వీరిని టార్గెట్ గా చేసుకోని ఘోరంగా ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్ కు కారణం ఉందంటూ సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు.
Ashwin: ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ గా అవతరించేందుకు ఆసీసీ నానా తంటాలు పడుతుంది. ఇప్పటికే ఫైనల్ చేరిన ఆ జట్టు.. ప్రతిష్టాత్మక టైటిల్ గెలిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇక ఫైనల్ టెస్ట్ మ్యాచ్ కంటే ముందు.. భారత్ తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. భారత గడ్డపై ఈ సిరీస్ ఉండటంతో.. కంగారులు కొత్త ప్రయత్నానికి తెరతీశారు.
Hanuma Vihari: తెలుగు క్రికెటర్ హనుమ విహారి పట్టుదల ప్రదర్శించాడు. జట్టు కోసం గాయాన్నైనా లెక్క చేయకుండా పోరాటం చేశాడు. ఓ వేగమైన బంతికి హనుమ విహారి మణికట్టు విరిగింది. అయిన జట్టు కోసం అతడు బ్యాటింగ్ చేసిన తీరును క్రికెట్ అభిమానులు మెచ్చుకుంటున్నారు.