Home / latest sports news
WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ లో మెుదటి మ్యాచ్ లో పరుగుల వరద పారింది. ఓ వైపు పరుగులు వరద పారుతుంటే.. మరోవైపు వికెట్ల మోతా మోగింది. ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్ భారీ విజయం సాధించింది. పురుషుల ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబయి.. మహిళల లీగ్ ఆరంభ పోరులోనూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా టెన్నిస్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే అభిమానుల కోసం హైదరాబాద్ వేదికగా ఈరోజు ఎల్బీ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడింది. సానియా-రోహన్ బొప్పన్న టీమ్స్ తలపడ్డాయి. డబుల్స్ లో సానియా మీర్జా- బొప్పన్న జోడీ, ఇవాన్ డోర్నిక్- మ్యాటిక్ సాన్స్ జంటను ఢీ కొట్టింది. మొత్తం రెండు మ్యాచ్ లు నిర్వహించనున్నారు.
Pathaan: పఠాన్ చిత్రం బాహుబలి-2 రికార్డును బద్దలు కొట్టింది. హిందీ భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి2 పేరిట ఉన్న రికార్డును చెరిపేసింది. దీంతో హిందీలో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా మెుదటి స్థానంలో నిలిచింది.
BAN vs ENG: క్రికెట్లో కొన్ని నిర్ణయాలు ఒక్కసారిగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇంగ్లాండ్ తో బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్ అడుతుంది.
Rohit Sharma: మూడో టెస్టులో ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ మ్యాచ్ లో ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. తొలి ఇన్నింగ్స్ లో తమ బ్యాటింగ్ సరిగాలేదని.. ఆ ఇన్నింగ్స్ లో ఇంకొన్ని ఎక్కువ పరుగులు చేయాల్సిందని రోహిత్ అన్నారు.
WTC Final: ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో ఆ జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. దీంతో జూన్ 7న ఇంగ్లండ్ వేదికగా జరగనున్న ఫైనల్లో భారత్ లేదా శ్రీలంకతో తలపడనుంది.
ICC Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్పిన్నర్లు అదరగొట్టారు. టెస్టుల్లో సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు మెుదటి స్థానంలో ఉన్న పేసర్ జేమ్స్ అండర్సన్ రెండో స్థానానికి పడిపోయాడు.
ఇంతకుముందు కపిల్ దేవ్ ఒక్కడే ఈ ఘనతను సాధించాడు. ప్రస్తుతం జడేజా ఆ ఫీట్ సాధించి.. ఇంటర్నేషనల్ క్రికెట్ లో 500 వికెట్లు సాధించిన రెండో ప్లేయర్ గా ఘనత సాధించాడు.
Ind Vs Aus 3rd Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాటర్లు విఫలం అయ్యారు. ఆసీస్ స్పిన్ ధాటికి చేతులెత్తయడంతో.. 109 పరగులకే భారత్ మెుదటి ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ బ్యాటర్లలో కోహ్లి మాత్రమే టాప్ స్కోరర్ గా నిలిచాడు.
New Zealand: తొలి టెస్టులో ఘన విజయం సాధించిన ఇంగ్లాండ్‌కు రెండో టెస్టులో కివీష్ షాకిచ్చింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో.. ఫాలోఆన్ ఎదుర్కొని మరీ ఒక్క పరుగు తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 258 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. 256 పరుగులకు ఆలౌటైంది.