BAN vs ENG: ఫన్నీ డీఆర్‌ఎస్..? బంగ్లా కెప్టెన్‌పై ఫ్యాన్స్ ఫైర్
BAN vs ENG: క్రికెట్‌లో కొన్ని నిర్ణయాలు ఒక్కసారిగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇంగ్లాండ్ తో బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్ అడుతుంది.
BAN vs ENG: ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ కెప్టెన్ పప్పులో కాలేశాడు. అతడు తీసుకున్న డీఆర్ఎస్ నెట్టింటా నవ్వులు తెప్పిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
ఏం జరిగిందంటే.. (BAN vs ENG)
క్రికెట్‌లో కొన్ని నిర్ణయాలు ఒక్కసారిగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇంగ్లాండ్ తో బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్ అడుతుంది. ఇప్పటికే మెుదటి రెండు మ్యాచుల్లో విజయం సాధించి సిరీస్ ను ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. క్రికెట్ మ్యాచ్ లో క్రికెట్ మ్యాచ్‌లో డీఆర్‌ఎస్‌లకు ఉన్న విలువ ప్రతి క్రికెటర్ కి తెలుసు. కొన్ని సందర్భాల్లో అంపైర్ నుంచి తమకు అనుకూలంగా ఫలితం రాని క్షణంలో వెంటనే సమీక్షను కోరుకుంటారు. అది కూడా కాస్త అనుమానం ఉన్నపుడు మాత్రమే ఇలా డీఆర్ఎస్ ను ఎంపిక చేసుకుంటారు. అది పక్కాగా నాటౌట్ అని తెలిసినా సరే.. ఫీల్డింగ్ జట్టు డీఆర్‌ఎస్‌ను తీసుకుంటే మాత్రం అది అనూహ్యం. కీలకమైన బ్యాటర్ ఉంటే ఆలోచించవచ్చు.. కానీ క్రీజులో ఉన్నది సాధారణమైన ఆటగాడు. పైగా ఆట ఇంకా మూడు ఓవర్ల ఆట మాత్రమే ఉంది. కానీ బంగ్లాదేశ్ కెప్టెన్ తీసుకున్న డీఆర్‌ఎస్ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
What prize do Bangladesh get for making the worst LBW review call in the history of cricket? pic.twitter.com/SfJWRdCpXc
— Jon Reeve (@jon_reeve) March 3, 2023
బ్యాట్ కి తాకిన డీఆర్ఎస్ తీసుకున్నాడు..
ఇంగ్లాండ్ – బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఇది వరకే రెండు వన్డేలను గెలిచిన ఇంగ్లాండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ రెండో వన్డే సందర్భంగా.. బంగ్లా కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ 47.6వ ఓవర్‌లో తీసుకున్న డీఆర్‌ఎస్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. టస్కిన్ అహ్మద్ వేసిన ఆ ఓవర్ చివరి బంతిని ఇంగ్లాండ్ బ్యాటర్ అదిల్ రషీద్ అడ్డుకున్నాడు. బ్యాట్‌ను బంతిని తాకినట్లు స్పష్టంగా కనిపించినా.. టస్కిన్ అహ్మద్ ఔట్ కోసం పెద్దగా అప్పీలు చేశాడు. అంపైర్ దానిని నాటౌట్‌గా ప్రకటించాడు. కానీ, కెప్టెన్ తమీమ్ మాత్రం వెంటనే రివ్యూ తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. తీరా, రిప్లేలో అది నాటౌట్‌గా తేలింది. ఇప్పుడిదే సోషల్ మీడియాలో మీమ్స్‌గా మారిపోయింది.