Home / Latest News
దివాళీ విత్ MI సేల్ కొనసాగుతోంది.ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్ల పై ప్రత్యేక ఆఫర్స్ ప్రకటించింది ఎంఐ.ఈ స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.4,999 విలువైన స్మార్ట్ వాచ్ ఫ్రీగా పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. రెడ్మీ నోట్ 11 SE మోడల్ పై ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.
రాజరాజ చోళుడు హిందూ రాజు కాదని జాతీయ అవార్డు గ్రహీత, తమిళ దర్శకుడు వెట్రిమారన్ చేసిన ప్రకటన చర్చకు తెరతీసింది.
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన సినిమా ‘ఆదిపురుష్’. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ఆదరాభిమానాలను కైవసం చేసుకుంది. కాగా రామాయణం ఇతివృత్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రను పోషిస్తున్నాడు. అందువల్ల ప్రభాస్ ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించిన రావణదహనం కార్యక్రమంలో పాల్గొన్నాడు.
ట్విట్టర్ కొనుగోలుపై ఎట్టకేలకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఓ దారికొచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక్కో ట్విట్టర్ షేరును 54.20 డాలర్ల చొప్పున 4,400 కోట్ల డాలర్లకు కొనేందుకు అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
తమిళ స్టార్ హీరో ధనుష్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ జంట విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి విదితమే. కాగా తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకోవడం లేదు కలవబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు కాల్స్ వచ్చాయి. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లోని ల్యాండ్‌లైన్ ఫోన్‌కు ఓ ఆగంతుకుడు ఫోన్ చేసి హాస్పటల్‌ను పేల్చాస్తానంటూ బెదింరించినట్టు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కశ్మీరు నుంచి ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలోనే అత్యంత ప్రశాంతతగల ప్రాంతంగా ఈ జమ్మూ-కశ్మీరుని మార్చుతామని ఆయన వెల్లడించారు. పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
సాధారణంగా చిన్న పిల్లలే కనిపించినవన్నీ మింగేస్తుంటారు. అలా కాయిన్స్, పేపర్లు, స్పూన్లు, చిన్నపిల్లల పొట్టలో కనిపించిన సందర్భాలను చూసాము, విన్నాం. కానీ ఇందుకు భిన్నంగా ఓ వృద్ధుడి కడుపులో ఏకంగా గ్లాస్ కనిపించింది ఇది చూసిన వైద్యులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రాజ్ ఘర్ ప్రాంతంలో జరిగింది.
ప్రాణాలకు కాపాడాల్సిన ఈ వైద్యుడు ఎంత క్రూరంగా ప్రవర్తించాడో తెలిస్తే ఆక్రోషం వస్తుంది. సోషల్ మీడియా స్నేహాలు ఎంత దారుణాలకు ఒడిగడతాయో చెప్పేందుకు ఈ ఘటన ఓక ప్రత్యక్ష ఉదాహరణ. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళను తన ఆసుపత్రికి రమ్మని ఆహ్వానించిన వైద్యుడు మరో ఇద్దరు వైద్యులతో కలిసి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ సోమవారం నుంచి అప్‌డెటేడ్ వీసా నిబంధనలను అమల్లోకి తెచ్చింది. పర్యాటకుల కోసం పలు ఆప్షన్లు అందుబాటులో ఉంచింది. అయితే ఇక్కడ దీర్ఘకాలం పాటు ఉండాలనుకొనే వారికి గతంలో ఎవరో ఒకరు స్పాన్సర్ చేయాల్సి ఉండేది. ప్రస్తుతం ఆ నిబంధన ఎత్తివేసింది.