Home / Latest News
కట్టుకున్న భార్యను మరో పర పురుషుడికి పడక సుఖం ఇవ్వాలని ఓ భర్త ఒత్తిడి చేశాడు. అనగా భార్య మార్పిడి క్రీడ (వైఫ్ స్వాపింగ్ గేమ్) ఆడాలని అతడు తన భార్యని ఒత్తిడి చేశాడు. దానికి ఆమె అంగీకరించలేదని ఆ కసాయి భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను హోటల్ గదిలో బంధించి ఆమెపై దాడి చేశాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్‌లో ప్రాంతంలో వెలుగు చూసింది.
ఇకపై మనదేశ భాష అయిన హిందీలోనే వైద్యవిద్య కొనసాగనుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో హిందీ మీడియంలో ఎంబీబీఎస్ కోర్సును కేంద్ర హోం మంత్రి అమిత్ షా అదివారం (అక్టోబర్ 16)న ప్రారంభించారు. ఈ క్రమంలో ఎంబీబీఎస్ సబ్జెక్టులైన అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీలకు సంబంధించిన మూడు వైద్యవిద్య హిందీ టెక్ట్స్ బుక్‌లను షా ఆవిష్కరించారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో 600 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్ ప్రస్తుతం 577 పాయింట్లు అభివృద్ధితో 58988 వద్ద, నిఫ్టీ 168 పాయింట్లు పెరిగి 17480 వద్ద కొనసాగుతున్నాయి. కాగా వరుసగా మూడో సెషన్ కూడా భారీ లాభాలతో సెన్సెక్స్ 59 వేల మార్క్‌ను అధిగమించింది.
అక్టోబర్ 16న గ్రూప్-1 పరీక్ష ప్రిలిమ్స్ పరీక్షను టీఎస్పీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా 503 పోస్టులకు గానూ మెుత్తం 2 లక్షల 86 వేల 51 మంది అభ్యర్ధులు ఈ పరీక్ష రాశారు. అయితే క్వశ్చన్ పేపర్ చాలా కఠినంగా, ప్రశ్నలు సివిల్స్ స్థాయిలో ఉన్నాయంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన కటాఫ్ మార్కులపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
సీఎం కేసిఆర్ కు మరో షాక్ తగిలింది. తెరాస పార్టీకి చెందిన ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన రూ. 80.65 కోట్ల రూపాయలు విలువైన స్ధిర, చర ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నాడు న్యూఢిల్లీలోప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 12వ విడత రూ. 16,000 కోట్లను విడుదల చేశారు.
మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో కోతుల పేరిట 32 ఎకరాల భూమి ఉంది.
Katragadda Murari : ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి శనివారం రాత్రి కన్నుమూశారు.
లవంగాలు, అనాస పువ్వు, లంగాలు, మరాఠీమొగ్గ లాంటి సుగంధ ద్రవ్యాలన్నింటిని నిత్యం వంటల్లో ఏదో ఒకరకంగా వాడుతూనే ఉంటాం. ఇవన్నీ ఆహారానికి చక్కని పరిమళాన్ని, అద్భుతమైన రుచిని జోడిస్తాయి. అయితే ఈ ఘుమఘుమలకు ధగధగలుతోడైతే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఈ సుగంద ద్రవ్యాలన్నీ నగల డిజైన్‌లో భాగమైతే? ఎలా ఉంటుందంటారు.
ఓ టీచర్ చేసిన అనాలోచిత పని వల్ల ఓ విద్యార్థిని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. పరీక్షల్లో కాపీయింగ్ చేస్తుందంటూ విద్యార్థిని అనుమానించిన టీచర్.. ఆ బాలికపై చేసిన పని ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. దీనితో ఒంటికి నిప్పంటించుకొని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ దారుణ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని జమ్షెడ్పూర్లో జరిగింది.