Stocks: లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో 600 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్ ప్రస్తుతం 577 పాయింట్లు అభివృద్ధితో 58988 వద్ద, నిఫ్టీ 168 పాయింట్లు పెరిగి 17480 వద్ద కొనసాగుతున్నాయి. కాగా వరుసగా మూడో సెషన్ కూడా భారీ లాభాలతో సెన్సెక్స్ 59 వేల మార్క్‌ను అధిగమించింది.
Stocks: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో 600 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్ ప్రస్తుతం 577 పాయింట్లు అభివృద్ధితో 58988 వద్ద, నిఫ్టీ 168 పాయింట్లు పెరిగి 17480 వద్ద కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు వస్తున్న క్రమంలో ఇన్వెస్టర్లు లాభాల బుక్కింగ్ వైపు మెుగ్గుచూపుతున్నారని చెప్పవచ్చు. కాగా వరుసగా మూడో సెషన్ కూడా భారీ లాభాలతో సెన్సెక్స్ 59 వేల మార్క్‌ను అధిగమించింది.
హిందాల్కో, భారతి ఎయిర్టెల్, ఎంఅండ్ ఎం, సంస్థలు భారీగా లాభపడుతుండగా కోల్ ఇండియా, ఎన్టీపీసీ సంస్థలు నష్టాలబాటలతో పయనిస్తున్నాయి. అటు డాలరు మారకం విలువలో రూపాయి 24 పైసలు లాభపడి 82.15 వద్ద ఉంది.
ఇదిలా ఉంటే అమెరికాలో రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుతం నాలుగు దశాబ్దాల గరిష్ఠాన్ని చేరుకుంది. ఈ విషయం ప్రపంచాన్ని ఆర్థికంగా ఆందోళనలోకి నెడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మాంద్యం భయాలతో ఇన్వెస్టర్లు మార్కెట్ నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని విశ్లేషకులు చెప్తున్నారు.
ఇదీ చదవండి: యాపిల్‌కు రూ. 150 కోట్ల జరిమాన..!