Spice Jewellery: లవంగం, అనాస పువ్వు.. వంటల్లోనే కాదు నగలుగానూ..!
లవంగాలు, అనాస పువ్వు, లంగాలు, మరాఠీమొగ్గ లాంటి సుగంధ ద్రవ్యాలన్నింటిని నిత్యం వంటల్లో ఏదో ఒకరకంగా వాడుతూనే ఉంటాం. ఇవన్నీ ఆహారానికి చక్కని పరిమళాన్ని, అద్భుతమైన రుచిని జోడిస్తాయి. అయితే ఈ ఘుమఘుమలకు ధగధగలుతోడైతే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఈ సుగంద ద్రవ్యాలన్నీ నగల డిజైన్‌లో భాగమైతే? ఎలా ఉంటుందంటారు.
Spice Jewellery: లవంగాలు, అనాస పువ్వు, లంగాలు, మరాఠీమొగ్గ లాంటి సుగంధ ద్రవ్యాలన్నింటిని నిత్యం వంటల్లో ఏదో ఒకరకంగా వాడుతూనే ఉంటాం. ఇవన్నీ ఆహారానికి చక్కని పరిమళాన్ని, అద్భుతమైన రుచిని జోడిస్తాయి. అయితే ఈ ఘుమఘుమలకు ధగధగలుతోడైతే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఈ సుగంద ద్రవ్యాలన్నీ నగల డిజైన్‌లో భాగమైతే? ఎలా ఉంటుందంటారు. సరిగ్గా ఇలానే ఆలోచించిన ప్రముఖ డిజైనర్ ప్రియంవద రానా ఈ సరికొత్త స్పైస్ జువెలరీకి ప్రాణం పోశారు.
ప్రకృతి అందానికి నిలయం. పువ్వులు, ఆకులు, తీగలు, మయూరాలు, ఏనుగులు, హంసలు ఈ సృష్టిలోని ప్రతి వస్తువు సొగసునూ నగలలో ప్రతిబింబిస్తారు కొందరు కళాకారులు. ఈ విధంగానే తాజాగా, మనం ఆహారంలో భాగం చేసుకునే మసాలా దినుసుల మాత్రం ఏం తక్కువ వాటితో ఎందుకు నగలు డిజైన్ చెయ్యకూడదు అని ఆలోచించారు ప్రముఖ డిజైనర్ ప్రియంవద. ఆలోచనను స్పైస్ జువెలరీ ద్వారా ఆచరణలోకి తీసుకవచ్చారు. వివిధ మసాలా దినుసుల రూపాలూ ఆభరణాల ఆకృతిలోకి మలచారు. పూర్తి పర్యావరణ హితమైన ముడి సరుకుతో ఈ స్పైస్ జువెలరీని రూపొందిస్తున్నారు జైపూర్‌కు చెందిన ప్రియంవద. బంగారం, వెండి, ప్లాటినమ్ వంటి ఖరీదైన లోహాలతోపాటు చవకైన ముడిపదార్థంతోనూ ఈ నగలును రూపొందిస్తున్నారు. లవంగాలు, యాలకులు, స్టార్ ఫ్లవర్స్, మరాఠీ మొగ్గలను పోలిన డిజైన్లతో తయారయ్యిన ఈ నగలు మగువల మనసు దోచేస్తున్నాయి. సంప్రదాయ వస్త్రాలతో పాటు ఆధునిక దుస్తులపైనా ఇవి చక్కగా సెట్ అవుతాయి.
ఇదీ చదవండి: ఈ టపాసులను ఎంచక్కా తినెయ్యొచ్చు..!