Home / Latest News
సూర్యగ్రహణం కారణంగా మంగళవారం నాడు రాష్ట్రంలోని పలు దేవాలయాలు మూతపడనున్నాయి. భక్తులకు తిరిగి బుధవారం దర్శనం కల్పించనున్నారు. ఈ క్రమంలోనే యాదాద్రీశుడి దేవాలయాన్ని కూడా మూసివేస్తున్నట్టు అధికాలు తెలిపారు.
ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మంచు విష్ణు చేసిన ట్వీట్ ఇప్పుడు బాగా ట్రోల్ అవుతుంది. విష్ణును ప్రభాస్ ఫ్యాన్స్ దారుణంగా తిట్టిపోస్తున్నారు. మొన్నామధ్య ఆదిపురుష్ టీజర్ పై కామెంట్లు వేసిన మంచు వారి అబ్బాయి ప్రభాస్ అభిమానుల ఆగ్రహానికి గురయిన సంగతి తెలిసింది.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు నోటీసులు ఇచ్చిన ఏపీ మహిళా కమీషన్ కు పలు పార్టీల నేతల నుండి నిరసనలు గుప్పుమంటున్నాయి. ప్రతిపక్ష పార్టీ అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు నోటీసులు పంపించారు సరే, వైకాపా నేతల పట్ల మహిళా కమీషన్ ప్రవర్తిస్తున్న తీరును తెదేపా నేత వర్ల రామయ్య సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు.
సినిమా హీరోగానే కాకుండా సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి పేరు తెచ్చుకున్నారు. కాగా తాజాగా ఇప్పుడు మహేష్ బాబు మరో బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతున్నారట.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలియచేశారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్నానంపై జ్నానం, దుష్ట శక్తులపై దైవశక్తి, సాధించిన విజయాలకు ప్రతీకే దీపావళిగా ఆయన తెలిపారు.
విహార యాత్ర అతనిపాలిట మృత్యువుగా మారింది. స్నేహితులతో సరదా కాస్తా నిండు ప్రాణాన్ని బలిగొన్న ఆ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకొనింది.
ఇటీవల కన్నడలో విడుదలైన కాంతార చిత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కన్నడలో అఖండ విజయం సాధించిన ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లోకి కూడా డబ్ చేయబడింది. అన్ని భాషల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పర్వం కొనసాగిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లోని ఎస్వీ పురం టోల్ ప్లాజా సిబ్బందిపై తమిళనాడుకు చెందిన విద్యార్థులు దాడి చేశారు.
తన అసెంబ్లీ సెగ్మెంట్లో వరిగడ్డిని కాల్చడాన్ని తగ్గించేందుకుగాను పంజాబ్ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్ ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 1 లక్ష ఇస్తానని ప్రకటించారు
ఆసియాలోని టాప్ 10 కాలుష్య నగరాల జాబితాలో ఎనిమిది భారతీయ నగరాలు చోటు దక్కించుకున్నాయి. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ విడుదల చేసిన డేటా ప్రకారం, ఎనిమిది భారతీయ నగరాలు ఆసియాలోని టాప్ 10 అధ్వాన్నమైన వాయు నాణ్యత ప్రాంతాల జాబితాలో ఉన్నాయి, అయితే ఒక నగరం మాత్రమే (ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం) టాప్ 10 ఉత్తమ వాయు నాణ్యత జాబితాలో చోటు సంపాదించగలిగింది.