Last Updated:

Yadadri Temple: రేపు రాష్ట్రంలోని పలు దేవాలయాలు బంద్

సూర్యగ్రహణం కారణంగా మంగళవారం నాడు రాష్ట్రంలోని పలు దేవాలయాలు మూతపడనున్నాయి. భక్తులకు తిరిగి బుధవారం దర్శనం కల్పించనున్నారు. ఈ క్రమంలోనే యాదాద్రీశుడి దేవాలయాన్ని కూడా మూసివేస్తున్నట్టు అధికాలు తెలిపారు.

Yadadri Temple: రేపు రాష్ట్రంలోని పలు దేవాలయాలు బంద్

Yadadri Temple: శాస్త్రాలలో సూర్యగ్రహనం చంద్రగహనాలకు ప్రత్యేకత ఉంది. ఆ సమయాలలో కొన్ని పనులు చెయ్యకూడదనేది అనాది కాలంగా వస్తున్న సంప్రదాయం. అయితే గ్రహనం గడియల్లో  పలు దేవాలయాలను మూసివేస్తారు. కాగా రేపు సూర్యగ్రహణం సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన యాదగిరి గుట్ట దేవస్థానాన్ని కూడా రేపు ఉదయం 8.50 అనగా మంగళవారం ఉదయం 8:50 గంటల నుంచి మరుసటి రోజు అనగా 26 ఉదయం 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తున్న ఆలయ అధికారులు ప్రకటించారు.
గ్రహణం కారణంగా స్వామివారకి జరిపే అనేక పూజా కార్యక్రమాలను నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవాలను కూడా రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 26న నిర్వహించే శత ఘట్టాభిషేకం, సహస్రనామార్చన సైతం జరుపడం లేదని అధికారులు తెలిపారు.

బుధవారం ఆలయం సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం ఉదయం 10 గంటల నుంచి దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్టు వెల్లడించారు. గ్రహణం కారణంగా చిలుకూరు బాలాజీ టెంపుల్ను కూడా మూసివేయనున్నారు. రేపు ఉదయం 8.30 గంటల నుంచి దర్శనాలు నిలిపివేస్తామని ఆలయ అర్చకులు ప్రకటించారు. సంప్రోక్షణ అనంతరం బుధవారం ఉదయం 6గంటలకు భక్తులను అనుమతిస్తామని ప్రకటించారు.  గ్రహణం కారణంగా మంగళవారం నాడు రాష్ట్రంలోని పలు దేవాలయాలు మూతపడనున్నాయి. భక్తులకు తిరిగి బుధవారం దర్శనం కల్పించనున్నారు.

ఇదీ చదవండి: ప్రకృతి అందాల పట్టుగొమ్మ “శ్రీశైలం”

ఇవి కూడా చదవండి: