Home / Latest News
అనుష్క ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అనుష్క ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తోంది. మహేష్.పి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో అనుష్క చెఫ్ గెటప్ లో "అన్విత రవళి శెట్టి" అనే పాత్రలో కనిపించనుంది.
భార్యాభర్తలన్నాక గొడవలు సహజం. కొన్నిసార్లు చిన్నచిన్న విషయాలే పెద్ద ఘర్షణలకు తావిస్తాయి. అయితే అక్కడ ఎవరు క్షణికావేషానికి లోనైనా కానీ భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇలాంటి కోవకు చెందిన ఘటనే చైన్నైలో ఒకటి చోటుచేసుకుంది. బిర్యానీ విషయంలో వృద్ధ దంపతుల మధ్య చెలరేగిన తగాదా భార్యకు నిప్పంటించేలా చేసింది. మరి ఈ ఘటన ఎక్కడ ఎప్పుడు జరిగిందో చూసేద్దాం.
గుజరాత్‌లోని గాంధీనగర్ మరియు మహారాష్ట్రలోని ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కు వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
ట్విట్టర్ యూజర్లపై ఎలాన్ మస్క్ మరో బాంబు పేల్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ కోసం నెలకు 8 డాలర్లు చెల్లించాలని మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ట్విట్టర్ యూజర్లందరి నుంచి డబ్బులు వసూలు చేసే ప్రణాళికలో మస్క్ ఉన్నారని ప్లాట్‌ఫార్మర్ తన నివేదికలో వెల్లడించింది.
తెలంగాణ ప్రభుత్వం తీరు పైన పటారం-లోన లొటారం అన్న సామెతమాటున ఉందంటూ సర్కారి సూళ్లు ఎత్తి చూపుతున్నాయి. జంట నగరాల్లోని 181 ఉన్నత పాఠశాలలకు సంబంధించి దాదాపుగా రూ. 15లక్షలు విద్యుత్ బిల్లులు బకాయి ఉన్నాయి.
రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రేషన్ కార్డులను కేంద్రం ప్రభుత్వం రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో సుమారు 10 లక్షల మంది ప్రజలు అక్రమంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ మేరకు వారందరీ రేషన్ కార్డులను రద్దు చేసేందుకు జాబితాను సిద్ధం చేసింది.
నేటి సమాజంలో పబ్ కల్చర్ శరవేగంగా విస్తరిస్తోంది. ఆడమగ వయసు వ్యత్యాసం లేకుండా తెగతాగేస్తున్నారు. తాగేసి గుట్టుచప్పుకుకాకుండా కొందరు ఉంటే మరికొందరు ఆ మైకంలో వారేం చేస్తున్నారో వారికే తెలియకుండా రోడ్డుపై నానా రచ్చ చేస్తుంటారు. ఈ కోవకు చెందినదే ఈ వీడియో మరి ఆ ఘటన ఏంటి ఎక్కడ జరిగిందో ఓ సారి చూసెయ్యండి.
బుధవారం తెల్లవారుజామున ఏపీలోని రాజమండ్రిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దానితో అటుగా నడిచే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని పేర్కొనింది.
దేశంలో చంద్రగ్రహణం వీడింది. తెలుగు రాష్ట్రాల్లో 39 నిమిషాల పాటు గ్రహణం కనిపించింది. గౌహతిలో అత్యధికంగా గంటా 43 నిమిషాలు కనిపించింది. దేశంలో కొన్ని నగరాల్లో సంపూర్ణంగా, కొన్ని నగరాల్లో పాక్షికంగా కనిపించింది.
ఈ ఏడాది యూరప్‌లో జూన్ నుంచి ఆగస్టు వరకు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. వేడి గాడ్పులకు కనీసం 15వేల మంది మృతి చెంది ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.