Home / Latest News
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తగినట్టుగానే ఆయన సతీమణి అల్లు స్నేహారెడ్డి ఫోటో షూట్లు, మోడ్రన్ లుక్స్‌తో అదరగొడుతుంది. ఈమెకు సోషల్ మీడియాలో క్రేజ్ ఎక్కువగానే ఉంది. ఈ అల్లు వారి కోడలకు నెట్టింట సుమారు తొమ్మిది మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. స్టార్ హీరోయిన్లకు దీటుగా స్నేహారెడ్డి ఫిట్నెస్తో నెట్టింట ఫొటోలతో హల్ చల్ చేస్తోంది. తన మేకోవర్‌కు సంబంధించిన పిక్స్, వీడియోలు ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తుంటుంది.
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు టీమ్ విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో ఏపీకి చెందిన వైఎస్ఆర్ సీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజుకు సిట్ నోటీసులు జారీ చేసింది.
31 మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన సీరియల్ రేపిస్ట్‌ను ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు. 'బీస్ట్ ఆఫ్ బోండి' అని కూడా పిలువబడే కీత్ సిమ్స్‌ను డీఎన్ఏ టెక్నాలజీ సహాయంతో గుర్తించారు.
పాకిస్థాన్ కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్‌ను ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎంపిక చేశారు. నవంబర్ 29న పదవీ విరమణ చేయనున్న జనరల్ కమర్ జావేద్ బజ్వా స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ మునీర్ నియమితులయ్యారు.
ఢిల్లీలోని జామా మసీదు మసీదు ప్రాంగణంలోకి పురుషులు లేకుండా మహిళల ప్రవేశాన్ని నిషేధించాలని నిర్ణయించింది. మసీదులోకి ఒంటరిగా లేదా గుంపులుగా మహిళలు ప్రవేశించడాన్ని నిషేధిస్తూ జామా మసీదు పరిపాలన ఉత్తర్వులు జారీ చేసింది.
లికాలంలో సాధారణంగా కీళ్ల నొప్పులు ఎక్కువగా బాధిస్తుంటాయి. వణికించే చలి కారణంగా కీళ్లు, మోకాళ్లు, ఎముకలలో ఎక్కువ నొప్పి కలుగుతుంది. మరి ఈ శీతాకాలంలో మీ శరీరాన్ని సహజంగా వెచ్చగా ఉంచుకోవడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు, మరికొన్ని థెరపీలు సహాయపడతాయి. అవేంటో చూసేయ్యండి.
కొన్ని కన్నడ న్యూస్ పోర్టల్‌ల నివేదికల ప్రకారం, యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతున్న సెట్ల నుండి వెలువడిన దుమ్ము ఎక్కువగా పీల్చడం వల్ల ఉపేంద్రకు ముక్కు రంధ్రాలు మూసుకుపోవడంతో శ్వాస తీసుకోవడంలో సమస్య ఉన్నట్లు నివేదించబడింది.
పవన్ కల్యాణ్ అభిమానులతోపాటు సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తాజాగా ఓ సందేశాన్ని మరియు కొన్ని ఫొటోలను హరిహర వీరమల్లు టీం నెట్టింట ప్రేక్షకులతో పంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సంస్థ 'బిస్లరీ'ని అమ్మకానికి పెట్టినట్టు ఆ సంస్థ ఛైర్మన్ రమేశ్ చౌహాన్ వెల్లడించారు. బిస్లరీ అమ్మకానికి సంబంధించి ఇప్పటికే పలు సంస్థలతో చర్చలు జరపుతున్నామని ఆయన తెలిపారు. ఈ సంస్థల్లో టాటా గ్రూప్ కూడా ఉందని వెల్లడించారు.