Home / Latest News
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ54 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శనివారం ఉదయం 11.56 గంటలకు రాకెట్ నింగిలోకి ఎగిరింది.
రిషబ్ శెట్టి నటించి తెరకెక్కించిన కాంతారా మూవీకి దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ సినిమా రికార్డులను సైతం బద్దలు కొట్టి టాప్ 1 సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. కాగా ఈ సినిమాలోని వరాహరూపం సాంగ్ అయితే వేరేలెవెల్ అని చెప్పవచ్చు. కాగా ఈ సాంగ్ విషయంలో కాంతారా చిత్ర బృందానికి ఊరట లభించింది.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ గత కొద్ది రోజులుగా ఎన్నో ఉద్యమాలు జరుగుతున్న సంగంతి తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ నేపథ్యంలో నేడు తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్రిక్తత నెలకొంది. అడ్మిన్ బిల్డింగును ఉక్కు కార్మికులు ముట్టడించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా కేఎస్ జవహర్ రెడ్డి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ మేరకు నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
అయ్యప్ప భక్తులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. శబరిమల వెళ్లే భక్తుల సౌకర్యార్థం డిసెంబరు, జనవరి నెలలో 38 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే ఓ ప్రటక జారీ చేసింది.
మనిషి తప్పు చేస్తే జీవిత ఖైదు విధించడం చూశాము. కానీ ఓ కోతికి కూడా జీవిత ఖైదు విధించారు. ఇకపై అది జీవితాంతం బోనులో ఉండాల్సిందే. అంతగా ఆ కోతి ఏం చేసింది ఎందుకు, ఎక్కడ దానికి జీవిత ఖైదు విధించారో ఓ సారి చూసేద్దాం.
ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల తరగతి గదుల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ డైరెక్టరేట్ "ప్రత్యేక ఏజెన్సీ" ద్వారా విచారణకు సిఫారసు చేసిందని, ఇందులో "రూ. 1,300 కోట్ల కుంభకోణం" జరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి.
ఢిల్లీ చాందినీ చౌక్ ప్రాంతంలోని భగీరథ్ ప్యాలెస్ మార్కెట్లోని దుకాణాలలో భారీ అగ్నిప్రమాదం జరగింది.
ఎయిర్ ఇండియా తన సిబ్బంది కోసం గ్రూమింగ్ నిబంధనల కొత్త జాబితాను విడుదల చేసింది. , ఈ జాబితాలో పురుష మరియు మహిళా సిబ్బందికి వస్త్రధారణ మార్గదర్శకాలు ఉన్నాయి, సూచనలలో కేశాలంకరణ, ఆభరణాలు, గోర్లు మరియు తగిన యూనిఫాంలకు సంబంధించిన మార్గదర్శకాలు ఉన్నాయి.
టీమిండియాలో కీలక ఆటగాడు అయిన దినేష్ కార్తిక్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. తాజాగా డీకే పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.