Last Updated:

Asaduddin Owaisi: ఎంపీగా ప్రమాణస్వీకారం చేస్తూ జై పాలస్తీనా అన్న అసదుద్దీన్ ఒవైసీ

ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం లోక్ సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా ఆయన పాలస్తీనా అనుకూల నినాదాలు చేయడంతో దుమారం రేగింది. బీజేపీకి చెందిన శోభా కరంద్లాజె అభ్యంతరం వ్యక్తం చేయడంతో, ప్రిసైడింగ్ అధికారి రాధామోహన్ సింగ్ దానిని రికార్డు నుండి తొలగించాలని ఆదేశించారు.

Asaduddin Owaisi: ఎంపీగా ప్రమాణస్వీకారం చేస్తూ జై పాలస్తీనా అన్న అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi: ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం లోక్ సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా ఆయన పాలస్తీనా అనుకూల నినాదాలు చేయడంతో దుమారం రేగింది. బీజేపీకి చెందిన శోభా కరంద్లాజె అభ్యంతరం వ్యక్తం చేయడంతో, ప్రిసైడింగ్ అధికారి రాధామోహన్ సింగ్ దానిని రికార్డు నుండి తొలగించాలని ఆదేశించారు.

అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారానికి వెళ్లగానే బీజేపీ ఎంపీలు ‘జై శ్రీరామ్’ నినాదాలు చేయడం ప్రారంభించారు. అనంతరం ఒవైసీ ఉర్దూలో ప్రమాణం చేసి ‘జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా’ అంటూ ముగించారు. ఈ వివాదంపై ఓవైసీని ప్రశ్నించగా. అందరూ చాలా మాటలు చెబుతున్నారు… నేను కేవలం ‘‘జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా’’ అని చెప్పాను..అలా అనడం వ్యతిరేకమని రాజ్యాంగంలో నిబంధనల ప్రకారం వ్యతిరేకమని ఎక్కడా లేదన్నారు. ఐదవసారి లోక్‌సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన ఒవైసీ, తర్వాత X లో చేసిన పోస్ట్‌లో, భారతదేశం యొక్క అట్టడుగు వర్గాల సమస్యలను తాను చిత్తశుద్ధితో లేవనెత్తుతానని చెప్పారు.తన నినాదంపై వివాదం చెలరేగడంతో, ‘జై పాలస్తీనా’ అని చెప్పకుండా రాజ్యాంగంలో ఎలాంటి నిబంధన లేదని ఒవైసీ అన్నారు.

రాజ్యాంగ విరుద్దం..(Asaduddin Owaisi)

ఇలా ఉండగా ఒవైసీ చేసిన ‘జై పాలస్తీనా’ నినాదం పూర్తిగా తప్పు అని, రాజ్యాంగానికి విరుద్ధమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు.ఓ వైపు రాజ్యాంగం పేరుతో ప్రమాణ స్వీకారం చేస్తూనే మరోవైపు రాజ్యాంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఒవైసీ అసలు స్వరూపం బయటపడింది.. ప్రతి రోజూ దేశంపై, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తారని అన్నారు.ఒవైసీ నినాదంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు స్పందిస్తూ.. మేం ఏ దేశానికీ మద్దతివ్వడం లేదా వ్యతిరేకించడం లేదని, అయితే సభలో ఏ దేశం పేరును ప్రస్తావించడం సరికాదని అన్నారు.

 

ఇవి కూడా చదవండి: