Home / latest national news
విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ తన భర్త నుండి భరణం కోరవచ్చని సుప్రీంకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. విడాకుల తర్వాత తన భార్యకు భరణం చెల్లించాలనే ఆదేశాలను సవాలు చేస్తూ ఒక ముస్లిం వ్యక్తి వేసిన పిటిషన్‌ను జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చి ఈ తీర్పును వెలువరించింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే పై బీహార్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్న బస్సు పాల ట్యాంకర్‌ను ఢీకొనడంతో 18 మంది మృతి చెందగా, 19 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
:ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం యొక్క మొదటి విడత పొందిన తర్వాత దాదాపు 11 మంది వివాహిత మహిళలు తమ ప్రేమికులతో పారిపోయారు.
ముంబై లోని వర్లీ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్ షాను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అతను తన బీఎండబ్ల్యూ తో స్కూటర్‌ను ఢీకొట్టి ఒక మహిళ చనిపోవడంతో జూలై 7 నుండి పరారీలో ఉన్నాడు.
నిర్ణీత సమయానికి మించి తెరిచి ఉంచినందుకు విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ పబ్ మరియు ఎంజిరోడ్లోని అనేక ఇతర సంస్థలపై బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పబ్ లకు అనుమతించిన సమయం రాత్రి ఒంటిగంట కాగా ఈ పబ్ లు రాత్రి 1,30 వరకు తెరిచి ఉంచడం, అర్దరాత్రి బిగ్గరగా సంగీతం వినిపిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సోమవారం అసోంకు చేరుకుని లఖిపూర్‌లోని ఫులెర్తాల్ సహాయ శిబిరంలో వరద బాధిత బాధితులను పరామర్శించారు. ముందగా సిల్చార్ జిల్లాలోని కుంభిగ్రామ్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ అక్కడనుంచి లఖిపూర్‌లోని వరద సహాయ శిబిరానికి చేరుకున్నారు.
గత 24 గంటలుగా కురుస్తున్నభారీ వర్షాలతో ముంబై అతలాకుతలమయింది. పలు ప్రాంతాలు జలమయవమగా సబర్బన్ రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా 50కి పైగా విమానాలు రద్దు అయ్యాయి. భారత వాతావరణ శాఖ ముంబై, థానే, పాల్ఘర్ మరియు కొంకణ్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
అసోంలో వరదలకు 56 మంది ప్రాణాలు కోల్పోగా 18 లక్షలమందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. అస్సాంలోని చాలా జిల్లాలకు వర్షం హెచ్చరికలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) రోజువారీ వరద నివేదిక ప్రకారం 27 జిల్లాల్లో బుధవారం నాటికి 16.25 లక్షల మంది ప్రజలు వరదనీటిలో చిక్కుకున్నారు.
బీహార్‌లోని సివాన్ జిల్లాలో బుధవారం భారీ వర్షాల కారణంగా రెండు వంతెనలు కూలిపోయాయి, రాష్ట్రంలో గత 15 రోజులలో బ్రిడ్జిలు కూలిపోయిన వాటిలో ఇది ఏడవ సంఘటన. అయితే బ్రిడ్జిలు కూలిపోయిన నేపధ్యంలో ఎవరూ మరణించలేదని, గాయపడలేదని అధికారులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో మంగళవారం స్వయం ప్రకటిత సాధువు భోలే బాబా నేతృత్వంలోని మతపరమైన సమ్మేళనం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 116 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దుర్ఘటన జరిగినప్పటి నుండి అతని ఆచూకీ తెలియలేదు.