Last Updated:

Ladakh: లడఖ్‌లో నదిలో కొట్టుకుపోయిన యుద్ద ట్యాంక్.. ఐదుగురు ఆర్మీ సిబ్బంది మృతి

లడఖ్‌లోని దౌలత్ బేగ్ ఓల్డీ వద్ద ట్యాంక్ ఎక్సర్‌సైజ్ చేస్తున్న సమయంలో ష్యోక్ నదిని దాటుతుండగా T72 ట్యాంక్ కొట్టుకుపోవడంతో ఐదుగురు ఆర్మీ సిబ్బంది కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. నదిలో నీటిమట్టం పెరగడం వల్ల ట్యాంక్‌ మునిగిపోయిందని అధికారులు తెలిపారు.

Ladakh: లడఖ్‌లో నదిలో కొట్టుకుపోయిన యుద్ద ట్యాంక్.. ఐదుగురు ఆర్మీ సిబ్బంది మృతి

Ladakh: లడఖ్‌లోని దౌలత్ బేగ్ ఓల్డీ వద్ద ట్యాంక్ ఎక్సర్‌సైజ్ చేస్తున్న సమయంలో ష్యోక్ నదిని దాటుతుండగా T72 ట్యాంక్ కొట్టుకుపోవడంతో ఐదుగురు ఆర్మీ సిబ్బంది కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. నదిలో నీటిమట్టం పెరగడం వల్ల ట్యాంక్‌ మునిగిపోయిందని అధికారులు తెలిపారు. మృతిచెందిన ఐదుగురు ఆర్మీ సిబ్బంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

రక్షణ మంత్రి సంతాపం.. (Ladakh)

ఈ విషాదకర ఘటన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. సామాజిక మాధ్యమం x లో ఇలా రాసారు. లడఖ్‌లోని ఒక నదిపై ట్యాంక్‌ను తీసుకెళ్తున్నప్పుడు దురదృష్టవశాత్తు ప్రమాదంలో ఐదుగురు మన వీర భారత ఆర్మీ సైనికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను.దేశానికి మన సైనికుల ఆదర్శప్రాయమైన సేవను మనం ఎప్పటికీ మరచిపోలేము. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాము. ఈ దుఃఖ సమయంలో దేశం వారికి అండగా నిలుస్తుందని అన్నారు.

ఇవి కూడా చదవండి: