Home / latest national news
Eknath Shinde Hospitalised: ప్రస్తుతం దేశమంతా మహారాష్ట్ర వైపే చూస్తుంది. ఆ రాష్ట్రంలో సీఎం పీఠాన్ని దక్కించుకునేది ఎవరనేది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. షిండే? ఫడ్నవీస్ ఎవరూ ‘మహా’ సీఎం అనే చర్చ జరుగుతున్న క్రమంలో అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షిణించింది. దీంతో హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన థానేలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. […]
Most Powerful Leaders In India: దేశంలో రాజకీయంగా అత్యంత శక్తిమంతమైన ప్రధానిగా నరేంద్రమోదీ నిలిచారు. 2024 దేశంలోని రాజకీయ పరిస్థితులు, నాయకుల పనితీరు ఆధారంగా వారి శక్తి, సామార్థ్యాలపై ఇండియా టూడే సర్వే నిర్వహించింది. తాజాగా ఇండియా టుడే ఈ సర్వేను ప్రకటించగా.. దేశంలో రాజకీయంగా మోదీ శక్తివంతమైన నాయకుడిగా అగ్రస్థానంలో ఉన్నట్టు వెల్లడించింది. ఆ తర్వాత స్థానాల్లో ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్, హోంమంత్రి అమిత్‌షా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఉన్నట్టు ఇండియా […]
కర్ఱాటకలోని ప్రైవేట్ పరిశ్రమలలో సి మరియు డి గ్రేడ్ పోస్టులకు కన్నడిగులు లేదా స్థానిక నివాసితులకు 100 శాతం రిజర్వేషన్లను తప్పనిసరి చేస్తూ కర్ణాటక మంత్రివర్గం ఆమోదించింది. అయితే, సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పరిశ్రమ దిగ్గజాల నుండి తీవ్ర విమర్శలు రావడంతో దానిని తొలగించారు
మహారాష్ట్రలోని ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తన వైకల్య ధృవీకరణ పత్రాన్ని పొందేందుకు పూణెలో నకిలీ చిరునామాను సమర్పించారు. 'వైకల్య ధృవీకరణ పత్రం' అధికారికంగా యశ్వంతరావు చవాన్ మెమోరియల్ హాస్పిటల్, పింప్రి ద్వారా జారీ చేయబడింది.
దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలలో జరిగిన 13 అసెంబ్లీ స్దానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి10 సీట్లు, బీజేపీ 2 సీట్లు గెలుచుకున్నాయి. పశ్చిమ బెంగాల్ లో 4, హిమాచల్ ప్రదేశ్ 3, ఉత్తరాఖండ్ 2, పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్ లోని ఒక్కో స్దానానికి జూలై 10న ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది.
జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు మరిన్ని అధికారాలను కల్పిస్తూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 నిబంధనలను సవరించింది.
ఇకపై ప్రతి సంవత్సరం జూన్ 25వ తేదీని 'సంవిధాన్ హత్యా దివస్'గా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసు కల్పితమని సీబీఐ తన ఛార్జిషీట్లో పేర్కొంది, మాల్దీవులకు చెందిన ఒక మహిళ తనతో లైంగిక సంబంధానికి అంగీకరించకపోవడంతో ఈ కేసులో శాస్త్రవేత్తలను తప్పుగా ఇరికించడంలో కేరళ పోలీసు స్పెషల్ బ్రాంచ్ మాజీ అధికారి చురుకైన పాత్ర పోషించారని సీబీఐ ఆరోపించింది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోపిడుగుపాటు కారణంగా 11 మంది మరణించగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రతాప్‌గఢ్‌లోని పోలీసు మరియు జిల్లా పరిపాలన సంయుక్త బృందాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి .