Horoscope for Wednesday, April 16 2025: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో లాభాలే లాభాలు..!

Horoscope for Wednesday, 2025, April 16: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది? అనే విషయాల జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు.
మేషం:
ఈ రాశి వారికి ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో సొంత నిర్ణయాలతో రాణిస్తారు. దైవారాధన మరవకూడదు. చంద్ర ధ్యానశ్లోకం చదివితే మంచిది
వృషభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. మీ మీ రంగాల్లో ఆత్మవిశ్వాసంతో పనులు చేపడతారు. కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటారు. మొండిబాకాయిలను వసూళ్లు చేస్తారు. ఇష్టదైవాన్ని పూజిస్తే మంచిది.
మిథునం:
ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. తమ రంగాల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. కోపాలకు దూరంగా ఉండడం మంచిది. రాముడిని పూజిస్తే మేలు జరుగుతుంది.
కర్కాటకం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. ఆటంకాలు ఎదురైన మనోబలంతో పరిష్కరించుకుంటారు. ఉద్యోగులకు కలిసివస్తుంది. వ్యాపారంలో పెద్దల సలహాలు తీసుకోవాలి. అష్టలక్ష్మీ స్తోత్రం చదవాలి.
సింహం:
ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలు. చేపట్టిన పనుల్లో ఆటంకాలను బుద్ధిబలంలో అధిగమించాలి. విదేశీయాన అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నవగ్రహాలను పూజించాలి.
కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల్లో పెద్దల సలహాలు తీసుకోవాలి. శ్రమిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సూర్యారాధన మంచిది.
తుల:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. ఇతర రంగాల్లో రాణించేందుకు ప్రయత్నిస్తారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సమస్యలు ఎదురవుతాయి. దుర్గాస్తోత్రం పఠిస్తే మంచిది.
వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి లాభాలు వస్తాయి. ధన వృద్ధి కలుగుతుంది. మంచి శుభవార్త వింటారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. ఇష్టదేవతను పూజించాలి.
ధనుస్సు:
ఈ రాశి వారికి అనుకూలం. వ్యాపార రంగాల్లో తిరుగులేని లాభాలు పొందుతారు. ఇతర విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇతరుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విష్ణువును ఆరాధించాలి.
మకరం:
ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం ఉత్తమం. ఆర్థికపరంగా లాభాలు ఉంటాయి. విష్ణువు ఆలయాన్ని సందర్శించడం శుభప్రదం.
కుంభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో లాభాలు ఉంటాయి. తోటి వారికి సహాయం చేస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శివారాధన మంచిది.
మీనం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. పెద్ద పెద్ద వారితో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవాలి. పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. నవగ్రహ పూజలు ఫలిస్తాయి.