Vivo T4 5G Launching: పెద్ద ప్లానే ఇది.. వివో లవర్స్ కోసం T4 5G.. 7300mAh బ్యాటరీతో రెడీ!

Vivo T4 5G Launching in India on April 22nd: టెక్ బ్రాండ్ వివో ప్రస్తుతం భారతదేశంలో అత్యుత్తమ పనితీరు అందించే తన T సిరీస్ స్మార్ట్‌ఫోన్ Vivo T4 5Gని లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది ఏప్రిల్ 22, 2025న విడుదల కావాల్సి ఉంది. ఈ ఫోన్ కోసం కొత్త టీజర్ పిక్చర్‌ను దానికి ముందే విడుదల చేసింది. దీని అర్థం ఇందులో భారతీయ ఫోన్‌లో ఇప్పటివరకు అతిపెద్ద 7300mAh బ్యాటరీ ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది.
Vivo T4 5G Specifications
రాబోయే Vivo T4 5G స్మార్ట్‌ఫోన్ రీబ్రాండెడ్ వెర్షన్ అయ్యే అవకాశం ఉంది. టీజర్ ఫోటోలను చూసిన Z10 మాదిరిగానే డిజైన్ ఉంటుందని తెలుస్తుంది. వెనుక భాగంలో వృత్తాకార కెమెరా మాడ్యూల్, ముందు భాగంలో పంచ్-హోల్ డిస్‌ప్లే, స్లిమ్ బెజెల్స్ ఉన్నాయి. లీక్స్ నిజమైతే Vivo T4 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.77-అంగుళాల ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే కానుంది.
ఈ వివో ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. అలాగే గ్రాఫిక్స్ కోసం Adreno 720 ఉండే అవకాశం ఉంది. Vivo T4 5G ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Funtouch OS 15 పై రన్ కావచ్చు. అలానే 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 7300mAh బ్యాటరీ ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌తో రావచ్చు. ఇందులో 50MP సోనీ IMX882 ప్రైమరీ షూటర్, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP షూటర్ ఉంది.
Vivo T4 5G Price
వివో ఇప్పటికే T4 ఎమరాల్డ్ బ్లేజ్, ఫాంటమ్ గ్రే కలర్స్‌ను ప్రదర్శించింది. ధర విషయానికొస్తే.. iQOO Z10 బేస్ వేరియంట్ ధర రూ. 21,999 నుండి ప్రారంభమైంది. అయితే టాప్ వేరియంట్ ధర రూ. 25,999 వరకు రావచ్చు. దీని ఆధారంగా, Vivo T4 కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉండవచ్చని, ధర రూ. 20,000 నుండి రూ. 25,000 వరకు ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి. Vivo T4 5G ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో సపోర్ట్ పేజీలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ దాని మునుపటి వెర్షన్‌ల మాదిరిగానే ఫ్లిప్‌కార్ట్, వివో అఫిషియల్ వెబ్‌సైట్ ద్వారా సేల్‌కి వస్తుంది.
ఇవి కూడా చదవండి:
- Motorola Edge 60 Stylus: తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి.. మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ లాంచ్.. ధర అసలు ఊహించలేరు!