Home / Latest Natioinal News
బీహార్ రాష్ట్రంలో రెండు వారాల్లో 12 వంతెనలు కూలిపోవడంతో 15 మంది ఇంజనీర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కొత్త వంతెనల పునర్నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఆదేశించింది. వీటి నిర్మాణ వ్యయాన్ని దోషులుగా తేలిన కాంట్రాక్టర్లే భరించాలి.
18వ లోక్‌సభ సభ్యుడిగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభ సభ్యునిగా మోదీ ప్రమాణస్వీకారం చేయడం ఇది మూడోసారి.వరుసగా మూడవసారి ఎన్డీఏ కూటమి గెలిచి కేంద్రంలో అధికారం చేపట్టిన విషయం తెలిసందే. ఈ నేపధ్యంలో మోదీ, మంత్రులు ఈ నెల జూన్ 9న ప్రమాణ స్వీకారం చేసారు.
ఇటీవల ముగిసిన లోకసభ ఎన్నికల్లో మెరుగైన స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ పార్టీ పరువు నిలుపుకుంది. అయితే కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, ఎస్పీ పొత్తు మ్యాజిక్ బాగా పనిచేసింది. మొత్తం 80 స్థానాలకు గాను ఇండియా కూటమికి 43 సీట్లు సాధించింది
కర్ణాటకలో ప్రస్తుతం ప్రజ్వల్ రేవన్న సెక్స్ స్కాండిల్ హాట్ టాపిక్‌గా మారింది. అయితే స్కాండిల్ వెలుగు చూసిన వెంటనే ప్రజ్వల్ దేశం నుంచి జర్మనీకి పారిపోయాడు. విదేశాలకు పారిపోయిన ప్రజ్వల్ తొలిసారి ఒక ప్రకటన విడుదల చేశాడు. వాస్తవాలు నిలకడగా వెలుగు చూస్తాయని, తాను అమాయకుడినని ప్రకటనలో పేర్కొన్నాడు.
ఏపీకి చెందిన ఓ మహిళ ఇటీవల ఢిల్లీలోని హోటల్లో బస చేసి బిల్లు కట్టే సమయంలో మోసం చేయటంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను విచారించగా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె బ్యాంకు ఖాతాలో కేవలం 41 రూపాయలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఢిల్లీలోని ఏరోసిటీలో ఉన్న పుల్మాన్ హోటల్లో ఝాన్సీరాణి గత డిసెంబర్లో 15 రోజులు ఉండడానికి గదిని బుక్‌చేశారు.
ఆన్లైన్ జాబ్ స్కామ్‌ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.అక్రమ పెట్టుబడులు మరియు పార్ట్‌టైమ్ ఉద్యోగ మోసాలకు పాల్పడిన దాదాపు 100 కు పైగా వెబ్సైట్లను బ్లాక్ చేసింది.బ్లాక్ చేయబడిన వెబ్సైట్ ఓవర్సీస్ వ్యక్తులు నిర్వహిస్తున్నారని అధికారిక ప్రకటనలో పేర్కొంది.
అన్నాడీఎంకే ( ఏఐఏడీఎంకే) పార్టీ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)తో తమ బంధం ముగిసినట్లేనని ప్రకటించింది. సోమవారం తమిళనాడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశం తర్వాత అన్నాడీఎంకే ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
ఉత్తరాఖండ్‌లోని మాల్దేవ్తాలోని డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ భవనం సోమవారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య కుప్పకూలింది. భారత వాతావరణ శాఖ (IMD) ఆదివారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే ఇరవై నాలుగు గంటల పాటు రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
పంజాబ్‌లోని అమృత్సర్ జిల్లాలో ఓ వ్యక్తి తన కుమార్తెను కొట్టి చంపి, ఆమె మృతదేహాన్ని బైక్‌కు కట్టి, రోడ్డుపై ఈడ్చుకెళ్లి రైలు పట్టాలపై పడవేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంటికి దూరంగా ఒక రోజు గడిపినందుకు అతను తన 20 ఏళ్ల కుమార్తెను హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు.
ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో మేక కన్ను బగర్ సాయి అనే 50 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు తీసింది. స్థానిక ఆలయంలో మేకను బలి ఇచ్చిన తరువాత ఈ దురదృష్టకర సంఘటన జరిగింది.