Home / Latest Natioinal News
భారత వాతావరణ విభాగం (ఐఎండి) కేరళలో రుతుపవనాలు మూడు నుండి నాలుగు రోజులు మరింత ఆలస్యం అవుతాయని అంచనా వేసింది. కేరళలో సాధారణంగా జూన్ 1న నైరుతి రుతుపవనాల ప్రారంభమవుతాయి. అయితే ఈ ఏడాది జూన్ 4న ప్రారంభమవుతాయంటూ మే 23 నాటి తన నివేదికలో ఐఎండి పేర్కొంది.
ఆదివారం జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నిరసన నిర్వాహకులు మరియు ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ మరియు నిరసన నిర్వాహకులపై కేసు నమోదు చేయబడింది.
దుబాయ్‌కి వెళ్లే ఇండిగో విమానాన్ని ఒక పక్షి ఢీకొట్టడంతో 160 మందికి పైగా ప్రయాణికులను దించాల్సి వచ్చింది. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం (ఎంఐఏ)లో గురువారం ఉదయం 8.25 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, ఆయన డిప్యూటీ డీకే శివకుమార్ మధ్య అధికారాన్ని పంచుకునే ఫార్ములా లేదని తన సహచర మంత్రి ఎంబీ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం స్పందించారు.
తన రాష్ట్రంలో ఆర్టికల్ 370ని పునరుద్ధరించే వరకు తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ చెప్పారు. అయితే తమ పార్టీ పీడీపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు.
1994లో అప్పటి గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ జి కృష్ణయ్య హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌కు మంజూరైన రిమిషన్‌కు సంబంధించిన అన్ని ఒరిజినల్ పత్రాలను సమర్పించాలని బీహార్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.
బీమా కుంభకోణం కేసుకు సంబంధించి జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సహాయకుడి నివాసంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బుధవారం సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌లోని మరో ఎనిమిది ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ హామీ ఇవ్వడంతో కర్ణాటకలోని చిత్రదుర్గ గ్రామస్థులు విద్యుత్ బిల్లులు చెల్లించడంలేదని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా సోమవారం తెలిపారు. దీనికి సంబంధించి మాల్వియా ఒక వీడియోను పంచుకున్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లకు మద్దతు నిచ్చి తప్పు చేయవద్దని రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ పంజాబ్ రైతులకు సూచించారు. పంజాబ్‌కు చెందిన రైతులు సోమవారం కిసాన్ యూనియన్ నాయకులు పోలీసు బారికేడ్లను ఛేదించారు.
చత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణంలో కాంగ్రెస్ నేత, రాయ్‌పూర్ మేయర్ ఐజాజ్ ధేబర్ సోదరుడు అన్వర్ ధేబర్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం అరెస్టు చేసింది.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఈ స్కామ్ లొ 2,000 కోట్ల విలువైన మనీలాండరింగ్‌కు సంబంధించిన ఆధారాలను కనుగొన్నట్లు తెలిపింది