Last Updated:

Websites: పార్ట్ టైమ్ జాబ్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న 100 వెబ్‌సైట్ల మూసివేత

ఆన్‌లైన్ జాబ్ స్కామ్‌ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.అక్రమ పెట్టుబడులు మరియు పార్ట్‌టైమ్ ఉద్యోగ మోసాలకు పాల్పడిన దాదాపు 100 కు పైగా వెబ్‌సైట్లను బ్లాక్ చేసింది.బ్లాక్ చేయబడిన వెబ్‌సైట్ ఓవర్సీస్ వ్యక్తులు నిర్వహిస్తున్నారని అధికారిక ప్రకటనలో పేర్కొంది.

Websites: పార్ట్ టైమ్ జాబ్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న 100 వెబ్‌సైట్ల మూసివేత

Websites: ఆన్‌లైన్ జాబ్ స్కామ్‌ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.అక్రమ పెట్టుబడులు మరియు పార్ట్‌టైమ్ ఉద్యోగ మోసాలకు పాల్పడిన దాదాపు 100 కు పైగా వెబ్‌సైట్లను బ్లాక్ చేసింది.బ్లాక్ చేయబడిన వెబ్‌సైట్ ఓవర్సీస్ వ్యక్తులు నిర్వహిస్తున్నారని అధికారిక ప్రకటనలో పేర్కొంది.

మోసపూరిత కార్యకలాపాలు..(Websites)

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యొక్క వర్టికల్ నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (NCTAU)కి చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ , ఈ మోసపూరిత వెబ్‌సైట్లను గుర్తించి గత వారం వాటిని బ్లాక్ చేయాలని సిఫార్సు చేసింది. ఈ వెబ్‌సైట్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 ప్రకారం, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ద్వారా బ్లాక్ చేయబడ్డాయి ఇటీవల బ్లాక్ చేయబడిన ఈ వెబ్‌సైట్లు మోసపూరిత పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్‌లతో పాటు అక్రమ పెట్టుబడులతో ముడిపడి ఉన్నాయి.ఈ వెబ్‌సైట్లను విదేశాలకు చెందిన వ్యక్తులు నిర్వహిస్తున్నారు. వారు తమ మోసపూరిత కార్యకలాపాలను నిర్వహించడానికి డిజిటల్ ప్రకటనలు, అద్దె ఖాతాలు మరియు చాట్ మెసెంజర్‌ల సహాయంతో ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్నారు.విదేశీ ఏటీఎం ఉపసంహరణలు, క్రిప్టోకరెన్సీలు, కార్డ్ నెట్‌వర్క్‌లు మరియు అంతర్జాతీయ ఫిన్‌టెక్ కంపెనీల వంటి వివిధ మార్గాల ద్వారా భారతదేశం నుండి బయటికి తరలించబడుతున్నాయని అధికారిక ప్రకటన తెలిపింది.