Last Updated:

PM Modi Takes Oath: లోక్‌సభ సభ్యునిగా ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం

18వ లోక్‌సభ సభ్యుడిగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభ సభ్యునిగా మోదీ ప్రమాణస్వీకారం చేయడం ఇది మూడోసారి.వరుసగా మూడవసారి ఎన్డీఏ కూటమి గెలిచి కేంద్రంలో అధికారం చేపట్టిన విషయం తెలిసందే. ఈ నేపధ్యంలో మోదీ, మంత్రులు ఈ నెల జూన్ 9న ప్రమాణ స్వీకారం చేసారు.

PM Modi Takes Oath: లోక్‌సభ సభ్యునిగా  ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం

PM Modi Takes Oath: 18వ లోక్‌సభ సభ్యుడిగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభ సభ్యునిగా మోదీ ప్రమాణస్వీకారం చేయడం ఇది మూడోసారి.వరుసగా మూడవసారి ఎన్డీఏ కూటమి గెలిచి కేంద్రంలో అధికారం చేపట్టిన విషయం తెలిసందే. ఈ నేపధ్యంలో మోదీ, మంత్రులు ఈ నెల జూన్ 9న ప్రమాణ స్వీకారం చేసారు.

కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం..(PM Modi Takes Oath)

18వ లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కొత్తగా ఎన్నికైన ఎంపీల చేత ప్రొటెం స్పీకర్ భర్త్ హరి మహతాబ్ తో ప్రమాణం చేయిస్తారు. ఇవాళ అండమాన్ నికోబార్, ఏపీ, అరుణాచల్‌, అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఎంపీల ప్రమాణం చేస్తారు. రేపు రెండో రోజు తెలంగాణకు చెందిన ఎంపీల ప్రమాణస్వీకారం ఉంటుంది. చివరగా పశ్చిమ బెంగాల్ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. పార్లమెంట్ సమావేశాల తొలిరోజు 280 మంది ఎంపీలు.. రేపు రెండో రోజు మిగిలిన 264 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒక్కో ఎంపీ ప్రమాణ స్వీకారానికి ఒక నిమిషం సమయం కేటాయిస్తారు. ఆ తర్వాత ఎల్లుండి అంటే..జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. జూన్ 27న ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు.

బాధ్యతాయుతమైన ప్రతిపక్షం అవసరం..

కొత్త లోక్‌సభ తొలి సెషన్‌ ప్రారంభం సందర్భంగా పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లో మీడియాతో మాట్లాడిన ప్రధాని మోదీ.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో తమ ప్రభుత్వం అందరినీ తీసుకెళ్తుందని చెప్పారు. ప్రజలు ప్రతిపక్షాలు మంచి పాత్ర పోషిస్తాయని ఆశించారు, కానీ అవి ఇప్పటివరకు నిరాశపరిచాయి. ప్రతిపక్షం ఇప్పటికయినా తన పాత్రను నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. భారతదేశానికి బాధ్యతాయుతమైన ప్రతిపక్షం అవసరం. ప్రజలకు నినాదాలు కాదు చర్చలు కావాలంటూ ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 65 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారని మోదీ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ఇది రెండోసారి అని ఆయన గుర్తు చేసారు. 60 ఏళ్ల తర్వాత ఈ సందర్భం వచ్చిందని ప్రధాని తెలిపారు.

ఇవి కూడా చదవండి: