Home / latest cinema news
మార్వెల్ స్టూడియోస్ సమర్పణలో హాలీవుడ్ బ్లాక్ బస్టర్ అయిన బ్లాక్ పాంథర్ మూవీ అందరికీ సుపరిచితే. బ్లాక్ పాంథర్ మూవీ సీక్వెల్స్ లో ఒకటిగా తెరకెక్కుతున్న బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్ చిత్రం భారతదేశంలో ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో నవంబర్ 11, 2022న థియేటర్లలో సందడి చెయ్యనుంది.
త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందించబడుతున్న ధమాకా చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విదలైన పోస్టర్లు, పాటలు మాస్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్ర బృందం ధమాకా క్రాకర్ అంటూ టీజర్‌ను రిలీజ్ చేసింది.
బాలయ్య సరసన నటించి అఖండ సినిమాతో భారీ హిట్ అందుకున్న ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. అటు చీరకట్టులోనూ ఇటీ మనీ స్కట్లోనూ కుర్రకారును కళ్లు తిప్పుకోకుండా చేస్తుంది ఈ అందాల భామ.
ఇప్పుడే నోట విన్నా కాంతారా మూవీ హవా కొనసాగుతుంది. కాంతారా చిత్రానికి వచ్చినంత పాజిటివ్ టాక్ ఇటీవల వచ్చిన ఏ చిత్రాలకూ రాలేదు. కాంతారా దెబ్బకు ఆర్ఆర్ఆర్, బాహుబలి, కేజీఎఫ్ రికార్డులు చిన్నబోయాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా ప్రస్తుతం కాంతారా చిత్రం మరో రికార్డును సాధించింది. దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.
చైల్డ్ ఆర్టిస్టుగా అరంగేట్రం చేసి, పదహారేళ్ళకే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి, సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో హన్సిక మొత్వాని ఒకరు. ‘దేశముదురు’, ‘మస్కా’, ‘బిల్లా’, ‘కందిరీగ’ వంటి పలు చిత్రాలలో నటించిన హన్సికకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ అందాల తార త్వరలో పెళ్లిపీటలెక్కబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
"అంతేనా.. వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ" అనే డైలాగ్ వినగానే మనకు ఎవరు గుర్తొస్తారో తెలుసుగా.. హహ హాసిని అంటూ తనదైన నటనతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ జెనీలియా. బాయ్స్ తో తెలుగుతెరకు పరిచమైన ఈ అందాల తార బొమ్మరిల్లు, రెడీ, సై, సాంబ, హ్యాపీ, ఆరెంజ్ లాంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసింది. మరి ఈ హీరోయిన్ తాజా ఫొటోలను చూసేద్దామా.
Kantara: సినిమాను భాషతో సంబంధం లేకుండా సినీలవర్స్ ఆదరిస్తుంటారు. సినిమా బాగుంది అంటే చాలు ఏ భాష చిత్రాన్నైనా ఆదిరిస్తుంటారు తెలుగు ప్రజలు. కన్నడ చిత్రపరిశ్రమ నుండి విడుదలైన మరో చిత్రరాజం “కాంతార”. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ సంస్థ అనువాదరూపంలో విడుదల చేసింది. కథేంటంటే.. భోగభాగ్యాలు ఉన్న ఓ రాజు ఏదో తెలియని లోటుతో మదనపడుతూండేవాడు. ఆయన ప్రశాంతతను వెతుక్కుంటూ పయనిస్తుండగా అడవిలో కనిపించిన ఓ […]
హాలీవుడ్ ప్రముఖ నటుడు రాబీ కోల్ట్రేన్ కన్నుమూశారు. హ్యారీపోటర్ సినిమాలు చూసిన ప్రతి ఒక్కరికీ రాబీ కోల్ట్రేన్ సుపరిచితుడే. ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాలైన హ్యారీపోటర్ సిరీస్‌లో రాబీ కోల్ట్రేన్ హాగ్రిడ్ అనే ముఖ్య పాత్ర పోషించి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
దేశంలోని ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే పండుగ కర్వాచౌత్. కాగా ఈ పర్వదినం సందర్భంగా బాలీవుడ్లో పలు కొత్త జంటలు సందడి చేశాయి. భర్త క్షేమం కోరుతూ మహిళలు ఈ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ.
త్రివిక్రమ్ సినిమాలో మహేష్‌బాబు కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం కోసం మహేష్ బాబు మేకోవర్ అవుతున్న ఫొటోను స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.