Home / latest cinema news
టాలీవుడ్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఢిల్లీ భామ రకుల్. కాగా ఈ స్టార్ హీరోయిన్ త్వరలో పెళ్లిపీటలెక్కబోతుందంటూ వార్తలు నెట్టంట చక్కర్లు కొడుతున్నాయి. కాగా 2023లో రకుల్ పెళ్లి చేసుబోతుందంటూ ఆమె సోదరుడు అమన్ ట్వీట్ చేశాడు. దానిపై రకుల్ ఏమని స్పందించిందో చూడండి.
తమిళ- తెలుగు అభిమానులుకు బిచ్చగాడు సినిమాతో అత్యంత చేరువైన హీరో విజయ్ ఆంటోనీ. కాగా ఈ నటుడు విడాకులకు సిద్ధమైనట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
సినీ పరిశ్రమలోనే కాకుండా ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన అల్లు అర్జున్ హవా కనిపిస్తుంది. టాలీవుడ్, బాలీవుడ్ తేడా లేకుండా ప్రతి చోట బన్నీ పేరు మార్మోగిపోతుంది. గతేడాది వచ్చిన పుష్ప సినిమాతో అల్లుఅర్జున్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ మూవీలో అల్లుఅర్జున్ నటనకు ఇప్పటికే ఫిలింఫేర్, సైమా అవార్డులు కైవసం కాగా ఇప్పుడు మరో అత్యున్నత అవార్డును అందుకున్నాడు బన్నీ.
చంద్రముఖి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో ఆ సినిమా ఓ రేంజ్ హిట్ అందుకుంది. కాగా ఇప్పుడు పి. వాసు దర్శకత్వం లో చంద్రముఖి -2 చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా మరి ఈ చిత్రంలో చంద్రముఖి ఎవరు అనేది సస్పెన్స్ గా మారిన క్రమంలో కాజల్ ఈ పాత్ర పోషించబోతున్నారంటూ సమాచారం.
యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రధానపాత్రలో నటించిన డీజే టిల్లు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేసింది. దానితో ఈ సినిమాకు సీక్వెల్ అయిన డీజే టిల్లు 2 షూటింగ్ ప్రారంభం అయ్యింది దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు కూడా నెట్టింట విడుదలైన విషయం విదితమే. ఈ సినిమాలో హీరోయిన్ తానే అన్నట్టుగా సిద్దు చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
సరోగసి ద్వారానే నయనతార, విఘ్నేశ్ శివన్ తల్లిదండ్రులయ్యారనే వార్తలు రావడంతో తీవ్ర దూమారం రేగింది. ఈ క్రమంలో తాజాగా విఘ్నేశ్ ఇన్‌స్టా స్టోరీస్‌లో చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
తమన్నా, టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. మిల్కీ బ్యూటీ అని పిలుచుకుని ఈ అందాల తారకు తెలుగు నాట అభిమానులు ఎక్కువే. పలు హిట్ చిత్రాలు నటింటి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. మరి ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోస్ చూసేద్దామా.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలియనివారుండరు. దేశవ్యాప్తంగా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ డార్లింగ్ కు తాజాగా కోర్టు నోటీసులు అందాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆదిపురుష్. అయితే ఈ మూవీ హిందువుల్లోని ఓ వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది.
రంగరంగ వైభంగా సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న భామ కేతికా శర్మ.. ఉప్పెన హీరోతో జతకట్టి కుర్రకారును కళ్లు తిప్పకుండా చేసింది ఈ భామ. కాగా తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ నెట్టింట విడుదల చేసిన ఫోటోలకు కిర్రాక్ కేతికా అంటూ నెటిజన్లు కామెంట్లు వేస్తున్నారు.
మహానటి సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కీర్తి సురేష్. కాగా ఆమె ఇటీవలె చేసిన సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే తాను గ్లామర్ రోల్స్ చెయ్యడానికి రెడీ అంటూ తాజాగా సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫొటోలను విడుదల చేసింది. ఆ ఫొటోస్ చూసిన అభిమానులంతా కీర్తి నయా లుక్ పై తెగ కామెంట్లు వేస్తున్నారు. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.