Home / latest cinema news
ఒకప్పటి టాలీవుడ్ హాట్ హీరోయిన్ రంభ కారు రోడ్డుప్రమాదానికి గురైయ్యింది. ఈ ప్రమాదంలో ఆమెకు మరియు ఆమె కుటుంబీకులకు గాయాలయ్యాయని ఇన్ స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేసింది రంభ.
సూపర్ స్టార్ కుటుంబం నుంచి వచ్చినా.. ఆ పేరును ఏమాత్రం తగ్గించకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుధీర్‌బాబు. ఇటీవల ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ యువ హీరో తాజాగా మరో ఆసక్తికర కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. కాగా ఈ యంగ్ హీరో నటిస్తోన్న తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. అయితే ఈ సినిమా విడుదల తేదీని తాజాగా మూవీమేకర్స్ వెల్లడించారు.
దక్షిణభారత ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ లారెన్స్ ఓ వైపు కొరియోగ్రఫీ, మరోవైపు దర్శకుడిగా ఇంకోవైపు హీరోగా చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. కాంచన-3 చిత్రం తర్వాత మూడేళ్ల పాటు గ్యాప్ తీసుకుని రుద్రుడు సినిమాతో లారెన్స్ మరోసారి ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.
తనకు ప్రాణాంతకమైన ‘మైయోసిటీస్’ అనే వ్యాధి ఉన్నట్లు సమంత ఇన్ స్టాగ్రామ్ లో షాకింగ్ విషయం చెప్పింది. చేతికి సెలైన్ ఎక్కించుకుంటున్న ఫొటోను వెనుక నుంచి చూపిస్తూ ఫొటో షేర్ చేసింది.
ఆర్ఆర్ఆర్ చిత్రం పాటలకు జపనీస్ సైతం స్టెప్పులేస్తూ తెగ వైరల్ అవుతున్నారు. ముఖ్యంగా నాటు నాటు సాంగ్ సిగ్నెచర్ స్టెప్పుకైతే ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న తారక్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మేము భారతీయులం, డ్యాన్స్ మా రక్తంలోనే ఉందంటూ సంచలన కామెంట్స్ వేశారు.
భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో దూసుకుపోతున్న కాంతార చిత్రానికి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ మూవీలోని వరాహ రూపం దైవవరిష్టం పాటను థియేటర్లలో ప్లే చేయకూడదని ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మహేష్ ఆ పేరులోనే ఓ మత్తు ఉంటుంది అని ఓ సినిమాలో కలర్స్ స్వాతి చెప్పిన డైలాగ్. మహేష్ కున్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే అది నిజమేననిపిస్తుంది కొన్ని సార్లు. ఈ నేపథ్యంలోనే సౌత్ ఇండియాలో ఏ స్టార్ హీరోకు దక్కని ఓ అరుదైన గౌరవం మహేష్ కు దక్కింది. సోషల్ మీడియా దిగ్గజం అయిన ట్విట్టర్ లో ఆయన ఫాలోవర్స్ సంఖ్య దాదాపు 13 మిలియన్లు దాటింది.
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ వారసుడు. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషాల్లో విడుదల చేయనున్నారు చిత్ర బృందం. విజయ్ 66వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకురాబోతున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా వారసుడు చిత్రం సంక్రాంతి బరిలో జనవరి 12, 2023న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.
ఈషా రెబ్బ తెలుగు నటి. ఈ అందాల తార అంతకు ముందు... ఆ తరువాత... చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైనది. ఈషా ఏప్రిల్ 19న జన్మించారు. హైదరాబాద్, తెలంగాణలో పెరిగారు. ఎం.బి.ఏ చదివారు. ఫేస్బుక్లో ఆమే ఫొటోలు చూసి ఇంద్రగంటి మోహన కృష్ణ ఆమెను నటిగా పరిచయం చేశారు. అ, అరవింద సమేత, బ్రాండ్ బాబు, తదితరల సినిమాలలో ఈమె నటించారు. దాదాపు 10ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలను పొందుతుంది ఈ అందాల భామ.