Home / latest cinema news
నయనతార విఘ్నేశ్ శివన్ జోడి సరోగసి విషయంపై తీవ్ర దుమారం రేగుతున్న విషయం విధితమే. అయితే తాజాగా ఈ తమిళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నయన్ దంపతుల సరోగసి వ్యవహారం చట్టబద్ధమే అని తేల్చి చెప్పింది.
టాలీవుడ్ అగ్ర కథానాయికగా వెలుగొందుతూ, పాన్ ఇండియా సినిమాలతో నిత్యం బిజీబిజీగా ఉంటున్నారు సమంత. కాగా కొద్దిరోజులుగా సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ స్టార్ హీరోయిన్ పై అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇటీవలె ఈమె ఫేస్ కు సర్జరీ చేయించుకున్నారని అనేక వార్తలు వినిపిస్తున్నాయి.
భాషతో సంబంధం లేకుండా థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్న కాంతార మూవీ భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అయితే కాంతార క్రేజ్ రాష్ట్ర ప్రభుత్వానికే కాక కేంద్రానికి సైతం పాకిందని చెప్పవచ్చు. ఈ సినిమాను ప్రధాని మోడీ స్పెషల్ స్క్రీన్ పై చిత్ర బృందంతో కలిసి చూడాలని ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం.
కాంతార సినిమా చూస్తూ ఒక వ్యక్తి ప్రాణాలు వదిలారని తెలుస్తోంది. రాజశేఖర్ అనే 45 ఏళ్ల వ్యక్తి ఈ సినిమా చూస్తూ కూర్చున్న సీటులోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
కాంతార మూవీ కాపీరైట్ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలోని వరహరూపం దైవ వరిష్టం అనే గీతాన్ని కాపీ కొట్టారంటూ కేరళకు చెందిన మ్యూజిక్‌బ్యాండ్ థాయికుడమ్ బ్రిడ్జ్ ఆరోపించింది. తాము రూపొందించిన ‘నవరసం’ అనే పాటను కాపీ కొట్టి ‘వరాహరూపం..’పాటను కంపోజ్ చేశారని పేర్కొనింది.
విక్రమ్ ఈ స్టార్ హీరోకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. విభిన్న కథల ఎంపికతో, తన నటనాశైలితో యావత్ దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న ఈ ప్రముఖ హీరో ఇప్పుడు మరో సరికొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీకి సంబంధించి దీపావళి సందర్భంగా వీడియో గ్లింప్స్ నెట్టింట సందడి చేస్తోంది.
#MEGA154 నుంచి తాజా అప్ డేట్ వచ్చింది. సినిమా గ్లింప్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దీన్ని చూసి మెగాఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. గ్లింప్స్ అదిరిపోయిందని, బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఫుల్ మాస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఆదిపురుష్ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చేప్తూ దర్శకుడు ఓం రౌత్ ఓ ట్వీట్ చేశాడు. మరియు ఆదిపురుష్ టీం నుంచి ప్రభాస్ రాముడి గెటప్ లో ఉన్న స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు.
ప్రముఖ హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ నటించిన "బ్లాక్ ఆడమ్" అక్టోబర్ 20 గురువారం నాడు బాక్సాఫీస్ వద్ద విడుదలయిన విషయం తెలిసిందే. బాక్స్ ఆఫీస్ ఇండియా ప్రకారం, మొదటి రోజు ఈ చిత్రం 6-7 కోట్ల మార్క్‌ను చేరుకుంది.
జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళీ కాంబినేషన్ తెరకెక్కి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చిత్రం ఆర్ఆర్ఆర్. తాజాగా, ఈ చిత్రం శుక్రవారం (అక్టోబరు 21) జపాన్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన ప్రమోషన్ ఈవెంట్లో ఎన్టీఆర్ జపనీస్ భాషలో ప్రసంగించి అందరి అబ్బురపరిచారు.