Home / latest cinema news
ఫ్యాక్షనిజానికి హీరోయిజమ్ జోడించి ప్రేక్షకులను మెప్పించి ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్లను సాధించిన హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ. ఫ్యాక్షనిజమ్ నేపథ్యంలోనే బాలకృష్ణ నటించిన చిత్రం ‘చెన్నకేశవరెడ్డి’. శ్రీసాయిగణేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.వి.వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేశ్ ఈ మూవీని నిర్మించారు. 2002 సెప్టెంబర్ 25న ‘చెన్నకేశవరెడ్డి’ ప్రేక్షకుల ముందు విడుదలై అపూర్వ విజయాన్ని సాధించింది.
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో శ్రుతి హాసన్ కథానాయికగా, ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ షూటింగ్ లో డార్లింగ్ పాల్గొన్నాడు. హైదరాబాద్లో జరుగుతున్న ఈ షూటింగ్కి సంబంధించి తాజాగా ఓ ఫొటో లీక్ అయ్యి అది నెట్టింట వైరల్ అవుతుంది.
తమిళంతో పాటు తెలుగునాట మంచి క్రేజ్ ఉన్న హీరో విక్రమ్. ఈ స్టార్ హీరో ముఖ్య పాత్రలో నటించిన ఇటీవల చిత్రం కోబ్రా. ఈమూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను తాజాగా ప్రకటించింది చిత్ర బృందం.
అటు తమిళం ఇటు తెలుగు చిత్ర పరిశ్రమల్లోనూ సమానంగా క్రేజ్ ఏర్పరుచుకున్న స్టార్ హీరో అజిత్ కుమార్. కాగా ఈ ఏడాది ‘వలిమై’చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాడు. ఈ క్రమంలోనే అదే జోష్‌తో వరుసగా సినిమాలను చేస్తూ బిజీబిజీగా ఉంటున్నారు ఈ తమిళ నటుడు. ఇప్పటికే ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. తాజాగా ఈ స్టార్ హీరోకి సంబంధించిన సినిమా నుంచి ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Paga Paga Paga Movie Review: బెజ్జోని పేటలో ఒక్కసారి డీల్ కుదిరితే చచ్చినా పని చేసి చస్తారు అనే పాయింట్ ఆధారంగా సినిమా కథ సాగుతుంది. జగ్గూ (కోటి), కృష్ణ (బెనర్జీ) సెటిల్మెంట్ చేస్తూ హత్యలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ పోలీస్‌ను చంపిన కేసులో కృష్ణ అరెస్ట్ అవుతాడు. అదే సమయంలో జగ్గూకి కూతురు సిరి (దీపిక ఆరాధ్య) జన్మిస్తుంది. అరెస్ట్ అయిన కృష్ణ కుటుంబానికి అండగా ఉంటానని ఇచ్చిన మాటను మరిచిపోతాడు జగ్గూ. […]
Krishna Vrinda Vihari Movie Review: ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ వంటి వరుస హిట్స్‌తో యంగ్ హీరో నాగశౌర్య టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ‘ఛలో’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకుని తెలుగునాట మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. అయితే ఆ తరువాత ఈ కుర్ర హీరోకు వరుస చిత్రాలు ఫ్లాప్ నిచ్చి నిరాశపరిచాయి. ఎలాగైనా హిట్ కొట్టాలనే సంకల్పంతో ‘కృష్ణ వ్రింద విహారి’ మూవీ ద్వారా నేడు ప్రజల ముందుకు వస్తున్నాడు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో […]
రాజమౌళి తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ అయిన ‘ఆర్‌ఆర్‌ఆర్' భారీ వసూళ్లు సాధించటమే కాదు ఆస్కార్ రేసులోనూ నిలుస్తుందని చాలామంది అనుకున్నారు. ఈ విషయంపై కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా చర్చ జరిగింది. దీనితో కచ్చితంగా ఈ సినిమా ఆస్కార్ రేసులో నిలుస్తుందని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఊహించని క్రమంలో ఆర్ఆర్ఆర్కు నిరాశ ఎదురైంది. తాజాగా భారత్ తరఫున ఆస్కార్ రేసులో గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో’ అధికారికి ఎంట్రీ ఇవ్వనుంది.
ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ (58) ఇక లేరు. స్టాండ్ అప్ కామెడీలో ఒక వెలుగు వెలిగిన శ్రీవాస్తవ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య కారణాలతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీవాస్తవ తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు.
ఇటీవలె కాలంలో బాక్సాఫీస్ వద్ద రీ-రిలీజ్‌ల పర్వం కొనసాగుతుంది. కాగా తమ అభిమాన స్టార్ హీరోల సినిమాలను రి-రిలీజ్ చేస్తూ అభిమానులు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదని చెప్పవచ్చు. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజున ‘పోకిరి’, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జల్సా, తమ్ముడు వంటి సినిమాలను స్పెషల్ షోలుగా రీ-రిలీజ్ చేశారు అభిమానులు కాగా ఇప్పుడు ఆ వరుసలో బాలయ్యబాబు కూడా చేరాడు. చెన్నకేశవ రెడ్డిగా థియేటర్లలో మళ్లీ రచ్చలేపనున్నాడు.
టాలీవుడ్ యువ మన్మథుడిగా నాగచైతన్యకి ప్రజల్లో మంచి క్రేజ్ ఉంది. లవ్‌స్టోరీ, బంగార్రాజు వంటి వరుస హిట్లతో జోరు మీదున్న నాగచైతన్య స్పీడుకు ‘థాంక్యూ’ చిత్రం బ్రేక్ వేసింది. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే చైతన్య ‘ధూత’ అనే హారర్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే నాగచైతన్య తన తర్వాతి "NC22" చిత్రాన్ని పట్టాలెక్కించాడు.