Last Updated:

ED Raids: మంత్రి గంగుల నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు!

తెలంగాణలో గ్రానైట్‌ వ్యాపారుల ఇళ్లలో ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయి. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు వస్తోన్న క్రమంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.

ED Raids: మంత్రి గంగుల నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు!

Hyderabad: తెలంగాణలో గ్రానైట్‌ వ్యాపారుల ఇళ్లలో ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయి. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు వస్తోన్న క్రమంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. గతంలోనే 8 ఏజెన్సీలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్‌, కరీంనగర్‌లో ఈడీ, ఐటీ సంయుక్తంగా సోదాలు జరుపుతున్నాయి. కరీంనగర్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇంటి వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మంకమ్మ తోటలో ఆయనకు సంబంధించిన శ్వేత గ్రానైట్‌, కమాన్‌ ప్రాంతాల్లో ఉన్న మహావీర్ గ్రానైట్‌లోనూ తనీఖీలు చేపట్టారు. గంగుల ఇంటి తాళాలు పగులగొట్టి మరీ ఈడీ సోదాలు జరుపడం గమనార్హం. ఆయన సోదరుల ఇళ్లల్లోనూ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు.

గ్రానైట్‌ వ్యాపారులు గంగాధరరావు, అరవింద్‌ వ్యాస్ ఇళ్లల్లో సైతం ఈడీ  సోదాలు చేస్తోంది. హైదరాబాద్‌, కరీంనగర్‌లోని మొత్తం 30 ప్రాంతాల్లో ఐటీ, ఈడీ దాడులు నిర్వహిస్తోంది. అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు ఆర్ధిక లావాదేవీల అంశాల పై చిక్కుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: MLAs purchasing case: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు నిందితుడు రామచంద్ర భారతి పై మరో కేసు

ఇవి కూడా చదవండి: