Last Updated:

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఇండో స్పిరిట్స్ యజమాని సమీర్ మహేంద్రు అరెస్ట్ చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇండో స్పిరిట్స్ యజమాని సమీర్ మహేంద్రుని అరెస్ట్ చేసింది. రాజేంద్ర ప్లేస్‌లోని యూకో బ్యాంకు ఖాతాకు కోటి రూపాయలు బదిలీ చేసినట్లు మహేంద్రుపై ఆరోపణలు వచ్చాయి

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఇండో స్పిరిట్స్ యజమాని సమీర్ మహేంద్రు అరెస్ట్ చేసిన ఈడీ

New Delhi: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇండో స్పిరిట్స్ యజమాని సమీర్ మహేంద్రుని అరెస్ట్ చేసింది. రాజేంద్ర ప్లేస్‌లోని యూకో బ్యాంకు ఖాతాకు కోటి రూపాయలు బదిలీ చేసినట్లు మహేంద్రు పై ఆరోపణలు వచ్చాయి. మద్యం పాలసీ కేసులో మరో నిందితుడు విజయ్ నాయర్‌ను అరెస్టు చేసిన మరుసటి రోజే ఈడీ మహేంద్రుని అరెస్ట్ చేసింది.

విజయ్ నాయర్ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో నిందితుడైన ఓన్లీ మచ్ లౌడర్ అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి మాజీ సీఈఓ అని ఈడీ వర్గాలు తెలిపాయి. అతడిని ప్రభుత్వ అధికారికి లంచం ఇచ్చినందుకు అరెస్టు చేశారు. విజయ్ నాయర్ 2014 నుండి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్ )తో అనుబంధం కలిగి ఉన్నాడు. పార్టీ కోసం నిధుల సేకరణ పనులు చేసేవాడు. ఆప్ యొక్క మీడియా మరియు కమ్యూనికేషన్ వ్యూహానికి నాయర్ బాధ్యత వహించారు. నాయర్ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు అత్యంత సన్నిహితుడని సంబంధిత ఈడీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే నాయర్ కు ఎక్సైజ్ పాలసీకి ఎటువంటి సంబంధం లేదని అమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది. విజయ్ నాయర్ ఆప్ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. గతంలో పంజాబ్‌లో మరియు ఇప్పుడు గుజరాత్‌లో కమ్యూనికేషన్ వ్యూహాలను అభివృద్ధి చేయడం మరియు అమలు చేయడం ఆయన బాధ్యత. ఎక్సైజ్ పాలసీతో తనకు ఎలాంటి సంబంధం లేదు. ఎక్సైజ్ కేసులో ఆయన్ను ఇప్పుడే సీబీఐ అరెస్ట్ చేసింది. గత కొద్దిరోజులుగా విజయ్ నాయర్‌ను విచారణకు పిలిచి మనీష్ సిసోడియా పేరు చెప్పాలని ఒత్తిడి తెచ్చారు. అందుకు నిరాకరించడంతో అరెస్టు చేస్తామని బెదిరించారని ఆప్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఆప్‌ని అణిచివేసేందుకు, ఆప్ గుజరాత్ ప్రచారాన్ని అడ్డుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నంలో ఇదొక భాగమే. దేశవ్యాప్తంగా ఆప్‌కి పెరుగుతున్న ఆదరణ చూసి బీజేపీ ఎంతగా విలవిలలాడుతుందో దేశం మొత్తం చూస్తోంది. గుజరాత్‌లో ఆప్‌కి వేగంగా పెరుగుతున్న ఓట్ల శాతం బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. బిజెపి అనుసరిస్తున్న ఈ రాజ్యాంగ విరుద్ధమైన మరియు చట్టవిరుద్ధమైన పద్ధతులను మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆప్ పేర్కొంది.

ఇవి కూడా చదవండి: