Home / Encounter
Anil Dujana: ఉత్తరప్రదేశ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్.. కరుడుగట్టిన నేరగాడు అనిల్ దుజానా పోలీసులు జరిపిన కాల్పుల్లో హతమయ్యాడు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన మాజీ ఎంపి, గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ గురువారం ఉత్తరప్రదేశ్ పోలీసు స్పెషల్ టాస్క్ ఫోర్స్‌తో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అతనితో పాటు ఉమేష్ పాల్ హత్య కేసులో వాంటెడ్ షూటర్ గులాం కూడ మరణించాడు.
ఉమేష్ పాల్ హత్య కేసులో మరో నిందితుడు విజయ్ కుమార్ అలియాస్ ఉస్మాన్ చౌదరి ప్రయాగ్‌రాజ్ పోలీసులతో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. కౌంధియార పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకు, నిందితులకు మధ్య ఎన్కౌంటర్ జరిగిందని ప్రయాగ్‌రాజ్ పోలీస్ కమిషనర్ రమిత్ శర్మ సోమవారం తెలిపారు
ఛత్తీస్‌గఢ్‌లో మావోలు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు హతమయ్యారు. కాంకేర్ జిల్లాలోని సిక్సోడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కడ్మే శివారు అటవీ ప్రాంతంలో సోమవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
నిత్యం తుపాకుల శబ్దాలతో జమ్మూకశ్మీర్ అట్టుడుకుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనలో అక్కడి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. కాగా మంగళవారం నాడు భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పులతో జమ్మూ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.