Home / Delhi Excise Scam
ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు జూలై 12 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. .జ్యుడీషియల్ కస్టడీ కోరుతూ రోస్ అవెన్యూ కోర్టుకు ఇచ్చిన దరఖాస్తులో, అరవింద్ కేజ్రీవాల్ దర్యాప్తుకు సహకరించడం లేదని తెలిపింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంపై విచారణకు సంబంధించి ఇండియా ఎహెడ్ న్యూస్ యొక్క వాణిజ్య అధిపతి మరియు ప్రొడక్షన్ కంట్రోలర్ అరవింద్ కుమార్ సింగ్ ను సీబీఐ అరెస్టు చేసింది.గోవా ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంస్థకు హవాలా మార్గాల ద్వారా రూ. 17 కోట్లు బదిలీ చేశారన్న ఆరోపణలపై అతడిని అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన తాజా పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త మరియు కేసులో నిందితుడైన అరుణ్ రామచంద్ర పిళ్లై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన వాంగ్మూలాలను ఫోర్జరీ చేసి, వాటిపై సంతకం చేయమని బలవంతం చేసిందని ఆరోపించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరోసారి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో ఈడీ అధికారుల తనిఖీలు చేపట్టారు. 25 బృందాలుగా ఏర్పడి ఈడీ సోదాలు చేస్తున్నారు. ఈడీ అధికారుల ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తాను ఉన్నానంటూ బీజేపీ నేతలు చేసిన ఆరోపణలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. దీనిపై ఆమె మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. కేసీఆర్ కూతురును కాబట్టే నాపై ఇలా ఆరోపణలు చేస్తున్నారు.