Home / Arrested
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. మునుగోడులో గొల్లకురుమలకు సబ్సిడీ డబ్బులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. రెండు గంటలకు పైగా రోడ్డు పై బైఠాయించడంతో రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మీడియా ప్రమోషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్ మరియు వ్యాపారవేత్త అభిషేక్ బోయిన్‌పల్లిని అరెస్టు చేసింది.
మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అరెస్టు పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలయింది.
భాగ్యనగరంలో ఓ నకిలీ ఫుడ్ ఇన్స్ పెక్టర్ భాగోతం బయటపడింది. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పలు హోటళ్ల యజమానుల నుండి నెలసరి మామూళ్లను నకిలీ ఫుడ్ ఇన్స్ పెక్టర్ వసూలు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు గుర్తించారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై విజిలెన్స్ విచారణకు సంబంధించి అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఏఐజీ) మన్మోహన్ కుమార్‌కు రూ. 50 లక్షలు లంచం ఇవ్వజూపిన పంజాబ్ మాజీ మంత్రి సుందర్ షామ్ అరోరా ను పంజాబ్ విజిలెన్స్ బ్యూరో అరెస్టు చేసింది.
విశాఖ విమానాశ్రయం వద్ద మంత్రుల కార్లపై రాళ్ల దాడి కేసులో జనసేన నాయకులు పోలీసులు అరెస్ట్ చేశారు.
పంజాబ్ విజిలెన్స్ విభాగం అధికారులు అవినీతి నిరోధక చట్టం కింద కోటి రూపాయల లంచం తీసుకున్న ఆరోపణలపై ఏఐజీ ఆశిష్ కపూర్ ను అరెస్ట్ చేసారు.
సినీ ఇండస్ట్రీలో ప్రేమలు బ్రేక్ అప్ లు కామన్. కానీ అవి కాస్త ముదిరితే కొన్ని విభేదాలకు తావిస్తాయి. కాగా తాజాగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ తెలుగు నటిపై ఫిట్‌నెస్ ట్రైనర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన దేశ ఆర్ధిక రాజధాని అయిన ముంబైలో చోటుచేసుకుంది.