YouTuber Chandu: యూ ట్యూబర్ చందును అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ చందు గాడు పేరుతో ఫేమస్ అయిన చంద్రశేఖర్ సాయి కిరణ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ నార్సింగి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనితో సాయి కిరణ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
YouTuber Chandu: యూట్యూబ్ చందు గాడు పేరుతో ఫేమస్ అయిన చంద్రశేఖర్ సాయి కిరణ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ నార్సింగి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనితో సాయి కిరణ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మూడు కోట్ల రూపాయలు డిమాండ్ ..(YouTuber Chandu)
ప్రేమించి పెళ్లి చేసుకోమంటే మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడని బాధిత యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా బాధితురాలి ఫిర్యాదుతో లైంగికదాడి, మోసం కింద కేసులు నమోదు చేశారు. పుట్టినరోజు వేడుకలకని బాధిత యువతిని పిలిచి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడని యువతి ఫిర్యాదులో పేర్కోంది. దీంతో చంద్రశేఖర్‌తోపాటు ఆయన తల్లిదండ్రులు, మరో ఇద్దరిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రశేఖర్‌ను అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకి తరలించినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యూట్యూబర్ చందు అసలు పేరు కోలా చంద్రశేఖర్ సాయికిరణ్. యూ ట్యూబ్ లో పక్కింటి కుర్రాడు పేరుతో వీడియోలు చేసి పాపులర్ అయ్యాడు. కొన్ని సినిమాలు, ఓటీటీల్లో నటించాడు. కొన్ని ఛానెల్స్ లో స్కిట్స్ చేసాడు. రెండేళ్ల కిందట పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వైద్యురాలు పరిచయమయింది. ఆమెతో వాట్సాప్ లో తరచుగా చాటింగ్ చేసి దగ్గరయ్యాడు. చివరకు లైంగిక దాడి చేసి మొహం చాటేసాడు. చివరకు యువతి ఫిర్యాదు తో కటకటాల పాలయ్యాడు.