Last Updated:

Actor Vinayakan: ‘జైలర్‘ నటుడు వినాయకన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా?

జైలర్  నటుడు వినాయకన్‌ను కేరళలోని ఎర్నాకులం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.పోలీసు అధికారి విధులకు ఆటంకం కలిగించి, మద్యం మత్తులో బెదిరింపులు మరియు మాటలతో దూషించినందుకు అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు.

Actor Vinayakan: ‘జైలర్‘ నటుడు వినాయకన్‌ను  అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా?

Actor Vinayakan: జైలర్  నటుడు వినాయకన్‌ను కేరళలోని ఎర్నాకులం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.పోలీసు అధికారి విధులకు ఆటంకం కలిగించి, మద్యం మత్తులో బెదిరింపులు మరియు మాటలతో దూషించినందుకు అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. అనంతరం అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి, బెయిల్‌పై విడుదల చేశారు.

పోలీసు స్టేషన్లో వీరంగం..(Actor Vinayakan)

మంగళవారం మధ్యాహ్నం, అతని అపార్ట్‌మెంట్‌లో వినాయకన్ నుండి మాకు కాల్ వచ్చింది. అక్కడికి వెళ్లి చూడగా అతడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. మహిళా కానిస్టేబుళ్లతో సహా మా అధికారులను దూషించాడు. అలా చేయకూబదని హెచ్చరించాం. అతని భార్య లేదా ఇతర కుటుంబ సభ్యుల నుండి ఎటువంటి ఫిర్యాదు లేదు, కాబట్టి మేము తిరిగి వచ్చామని కొచ్చిలోని ఎర్నాకులం టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్‌లోని సబ్-ఇన్‌స్పెక్టర్ చెప్పారు. సాయంత్రం 7.30 గంటల సమయంలో, అతను అదే మత్తులో పోలీస్ స్టేషన్‌కు వచ్చి గొడవ సృష్టించాడు. మా అధికారులపై మళ్లీ అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించాడు. దీని తో అతడిపై కేసు నమోదు చేసి, మద్యం మత్తులో ఉండడంతో వైద్య పరీక్షలు చేయించారు. అతనిని తరువాత బెయిల్‌పై విడుదల చేసామని చెప్పారు. వినాయకన్‌పై కేరళ పోలీసు చట్టంలోని 118(ఎ), 117(ఇ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద గతంలో కూడా అతను ఇలాంటి హంగామా చేశాడని తెలిపారు.

కాంగ్రెస్ విమర్శలు..

ఇలాఉండగా ప్రతిపక్ష కాంగ్రెస్ కేరళ పోలీసులు వినాయకన్‌పై భారత శిక్షాస్మృతి (IPC)లోని బెయిలబుల్ సెక్షన్లను మాత్రమే ప్రయోగించారని ఆరోపించింది. .ఫేస్‌బుక్‌లో కాంగ్రెస్ నాయకురాలు మరియు త్రిక్కక్కర ఎమ్మెల్యే ఉమా థామస్ అతని చెడు ప్రవర్తన మరియు విధుల్లో ఉన్న అధికారులను అడ్డుకున్నప్పటికీ స్టేషన్ బెయిల్‌పై విడుదలచేసారని విమర్శించారు. క్లిఫ్ హౌస్ సూచనల ప్రకారం అవార్డు గెలుచుకున్న నటుడిని విడుదల చేశారా అంటూ ప్రశ్నించారు. క్లిఫ్ హౌస్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారిక నివాసం.ఈ చట్టం గౌరవప్రదంగా పనిచేసే పోలీసు అధికారుల మనోభావాలను కించపరిచేలా ఉందని ఎమ్మెల్యే మంగళవారం ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.ఇటీవల రజనీకాంత్ సరసన తమిళ చిత్రం ‘జైలర్’లో కనిపించిన ఈ నటుడు, ‘కమ్మట్టిపాదం’ చిత్రంలో గంగ పాత్రకు 2016లో ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నారు.