Home / Arrested
పాకిస్తాన్ లోని కరాచీలో ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాల్‌ను పలువురు మహిళలపై అత్యాచారం చేసి బ్లాక్మెయిల్ చేసిన ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు.జియో న్యూస్ ప్రకారం, ప్రిన్సిపాల్ బాధితులను బ్లాక్ మెయిల్ చేయడానికి క్లోజ్డ్-సర్క్యూట్ టెలివిజన్ (CCTV) ఫుటేజీని ఉపయోగించాడు.
తోషాఖానా కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడిన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను శనివారం అరెస్టు చేశారు. ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు కూడా ఇమ్రాన్ ఖాన్ ఐదేళ్లపాటు క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది.శిక్షతో పాటు లక్ష పాకిస్థాన్ రూపాయల జరిమానా కూడా విధించింది. ఈ జరిమానా కట్టకపోతే ఇమ్రాన్ మరో ఆరు నెలల పాటు జైల్లో ఉండాల్సి వస్తుందని హెచ్చరించింది.
హైదరాబాద్ నగర శివార్లలోని బాటసింగారంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాలని పరిశీలించేందుకు వెళుతున్నకేంద్రమంత్రి, బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఓఆర్ఆర్పై తుక్కుగూడ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నడిరోడ్డుపై కిషన్ రెడ్డితోపాటు ఇతర బిజెపి నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కిషన్ రెడ్డి తదితరులని అరెస్ట్ చేసి పార్టీ కార్యాలయానికి తరలించారు.
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. మునుగోడులో గొల్లకురుమలకు సబ్సిడీ డబ్బులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. రెండు గంటలకు పైగా రోడ్డు పై బైఠాయించడంతో రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మీడియా ప్రమోషన్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ మరియు వ్యాపారవేత్త అభిషేక్ బోయిన్‌పల్లిని అరెస్టు చేసింది.
మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అరెస్టు పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలయింది.
భాగ్యనగరంలో ఓ నకిలీ ఫుడ్ ఇన్స్ పెక్టర్ భాగోతం బయటపడింది. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పలు హోటళ్ల యజమానుల నుండి నెలసరి మామూళ్లను నకిలీ ఫుడ్ ఇన్స్ పెక్టర్ వసూలు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు గుర్తించారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై విజిలెన్స్ విచారణకు సంబంధించి అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఏఐజీ) మన్మోహన్ కుమార్‌కు రూ. 50 లక్షలు లంచం ఇవ్వజూపిన పంజాబ్ మాజీ మంత్రి సుందర్ షామ్ అరోరా ను పంజాబ్ విజిలెన్స్ బ్యూరో అరెస్టు చేసింది.
విశాఖ విమానాశ్రయం వద్ద మంత్రుల కార్లపై రాళ్ల దాడి కేసులో జనసేన నాయకులు పోలీసులు అరెస్ట్ చేశారు.
పంజాబ్ విజిలెన్స్ విభాగం అధికారులు అవినీతి నిరోధక చట్టం కింద కోటి రూపాయల లంచం తీసుకున్న ఆరోపణలపై ఏఐజీ ఆశిష్ కపూర్ ను అరెస్ట్ చేసారు.