Last Updated:

ACP Umamaheswara Rao: సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు

ఉమామహేశ్వరరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి ఉమా మహేశ్వర్ రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఉమా మహేశ్వరరావుకు సంబంధించిన 17 ప్రాపర్టీలను అధికారులు గుర్తించారు. శామీర్ పేటలో ఒక విల్లా, ఘట్ కేసర్లో 5 ప్లాట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు.

ACP Umamaheswara Rao:  సీసీఎస్ ఏసీపీ  ఉమామహేశ్వరరావును  అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు

ACP Umamaheswara Rao: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి ఉమా మహేశ్వర్ రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఉమా మహేశ్వరరావుకు సంబంధించిన 17 ప్రాపర్టీలను అధికారులు గుర్తించారు. శామీర్ పేటలో ఒక విల్లా, ఘట్ కేసర్లో 5 ప్లాట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఉమామహేశ్వరరావు స్వగ్రామంలో సోదాలు..(ACP Umamaheswara Rao)

తెలంగాణ సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు రావడంతో అక్కడి ఏసీబీ అధికారులు ఉమామహేశ్వరరావు సొంతూరు అయిన చోడవరం నియోజకవర్గ బుచ్చయ్యపేట మండలం ఎల్బిపి అగ్రహారంలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలోని పులగాలిపాలెంలో గల ఉమామహేశ్వరరావు బంధువుల ఇంట్లో తనిఖీలు చేశారు.ఏసీబీ అధికారులు. ఏసీబీ విచారణలో ఉమామహేశ్వరరావు అక్రమ బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. న్యాయం కోసం వెళ్లిన బాధితులకు ఉమామహేశ్వరరావు చుక్కలు చూపించేవాడు. ఉమామహేశ్వరరావు వ్యవహార శైలిపై గతంలోనూ అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఉమామహేశ్వరరావుపై ఇప్పటికే మూడుసార్లు సస్పెన్షన్ వేటు పడింది. సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి.. ఉమామహేశ్వరరావు లక్షలు కాజేశాడు. ఎన్ఆర్‌ఐని సైతం బెదిరించి డబ్బులు దండుకున్నాడు. 50 కోట్ల మేర అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. నగదును అత్తమామల ఇంట్లో ఉంచినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. లావాదేవీల లెక్కలను ట్యాబ్‌లో సేవ్ చేసుకున్నాడు ఉమామహేశ్వరరావు.