Home / Ap latest news
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. ఈ సారి గెలిపించకుంటే ఇవే తన చివరి ఎన్నికలు అవుతాయని ఆయన అన్నారు.
ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్. ఇప్పుడున్న బ్రాండ్లతో కలిపి కొత్తగా మరో 10 మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో భూకంపం సంభవించింది. పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి. పది సెకన్ల పాటు భూమి కంపించడంతో భయంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఏపీ విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇకపోతే ఇదీ సభపై ప్రసంగించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో తమ అనుబంధం పార్టీలు రాజకీయాలకు అతీతమని పేర్కొన్నారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసింది.
రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ మార్పులపై రెండు రోజుల్లో గ్రామ సభలు నిర్వహించి సవరణలపై రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే మంత్రికి లేఖ వ్రాశారు. కుప్పంలో వందే భారత్ రైలుకు స్టాపింగ్ ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నారు.
రుషి కొండలో అక్రమంగా ప్రభుత్వం తవ్వకాలు చేస్తోందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ప్రతి చిన్న విషయం సుప్రీంకోర్టే తేల్చాలంటే ఎలా అని పిటిషనర్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
ఏపీలో రోజురోజుకు జనసేనాని బలం పెరుగుతోందా అంటే అవుననే అంటున్నాయి కొన్ని సర్వేలు. ఇటీవల ఎవరి ఎదుగుదల ఎంత అనేదానిపై వైసీపీ, తెదేపా పార్టీలు సర్వేలు నిర్వహించగా వీటిలో ఏపీలో జనసేన దూసుకుపోతోందని తెలుస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. బాణాసంచా తయారయ్యే ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా పలువురిగి గాయాలయ్యాయి.