Home / Ap latest news
తెలుగు భాష, తెలుగు సాహిత్యం దేశ ప్రజలందరికీ సుపరిచితమేనని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్న రాష్ట్రపతిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఏపీలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఏపీలో ఉండనున్నారు ఆమె. గతంలో రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం ఏపీ వచ్చిన ఆమె.. ఈసారి రాష్ట్రపతి హోదాలో రాష్ట్రంలో అడుగుపెట్టనున్నారు.
దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఈ స్కాంలో మరో నిందితుడైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో వైకాపా నేత, ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరును ఈడీ అధికారులు చేర్చిన సంగతి విదితమే. అయితే దీనిపై స్పందించిన మాగుంట ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనకు ఎలాంటి పాత్ర లేదని గురువారం స్పష్టం చేశారు
వాల్మీకి, బోయ, బెంతు కులాలను ఎస్టీల్లో చేర్చవద్దని గత కొంతకాలంగా గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటి ముట్టడికి గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. దానితో జగన్ నివాసం చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
విశాఖపట్నంలో ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన రశీదుపై అన్యమత కీర్తనలు ఉండటం కలకలం రేపింది. విశాఖ రైల్వే స్టేషన్లో ట్రాఫిక్ పోలీసు నిర్వహించే ప్రీపెయిడ్ ఆటోస్టాండ్‌లో ఇచ్చే ప్రయాణికులకు ఇచ్చే టోకెన్లపై ఒక మతానికి సంబంధించిన కీర్తనలు ముద్రించి ఉన్నాయి.
నెల్లూరు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వావిళ్లలోని ఓ టిఫిన్సెంటర్లో గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించినట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో దుర్మార్గుడి పాలన నుంచి రాష్ట్రాన్ని పిల్లల భవిష్యత్తుని కాపాడాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు టిడిపి నేత అయ్యన్నపాత్రుడు.
వైసీపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వివాదంలో చిక్కుకున్నారు. అయ్యప్ప దీక్షలో వుండి ముస్లిం టోపీ, కండువా ధరించడం వివాదాస్పదమైంది.
వచ్చేఏడాది జనవరి 27 నుండి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టేందుకు శ్రీకారం చుట్టనున్నట్లు మాజీ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
విశాఖలో రిషికొండను రేప్ చేస్తున్నారని ప్రకృతిని రేప్ చేసిన పాపం ఊరికేపోదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు.