Home / Ap latest news
బుధవారం తెల్లవారుజామున ఏపీలోని రాజమండ్రిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దానితో అటుగా నడిచే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని పేర్కొనింది.
నెల్లూరు జిల్లాలో సోమవారం ఉదయం భూమి కంపించింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ ఎయిర్ పోర్ట్‌లో చోటు చేసుకున్న ఉద్రిక్త సంఘటనల నేపధ్యంలో లో ఏసీపీ మోహన్‌రావు పై సస్పెన్షన్ వేటు పడింది.
పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఇప్పటం గ్రామంలోని బాధితుల పరామర్శకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన వాహనాలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానితో వాహనం దిగి ఆయన మూడు కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లారు. "వైసీపీ గూండాల అరాచకాలు ఇలాగే సాగితో ఇడుపులపాయలో మీ ఇళ్ల మీద నుంచి హైవే వేస్తాం" అని పవన్ హెచ్చరించారు.
గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అసాగో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు.
వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అస్వస్థతతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం నాడు ఆయన మరణించారు.
ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పొలం పనులు ముగించుకుని ట్రాక్టర్ పై వచ్చేందుకు సిద్ధమవుతున్న వలస కూలీలపై విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు కూలీలు దుర్మరణం చెందారు.
ఇప్పటికే అప్పుల ఊబిలో చిక్కుకుని తేలలేకపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాజాగా మరోమారు కొత్త రుణాన్ని సేకరించింది. తాజాగా మంగళవారం నాడు రూ.1,413 కోట్ల అప్పును తీసుకుంది.
సికింద్రాబాద్ నుంచి వస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్(17230)కు పెనుప్రమాదం తప్పింది. రైల్వేట్రాక్‌పై కొందరు దుండగులు అడ్డంగా ఇనుప రాడ్డును కట్టారు. ఇనుపరాడ్డును చూసి వెంటనే అప్రమత్తమైన లోకోపైలెట్ మంజునాథ్ రైలును ఆపేశాడు. దానితో పెను ప్రమాదం తప్పింది.
ఐటమ్ వంటి పదాలకు ప్రస్తుతం జైలు శిక్షలు పడుతున్నాయని అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని ఏపీ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సూచించారు