Home / Andhra Pradesh
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ క్యాంటమ్ కంపెనీలోని బాత్రూమ్ లో నవజాత శివువు కలకలం రేపింది. క్వాంటమ్ కంపెనీలో పని చేస్తున్న ఓ మహిళే ఆ బిడ్డను బాత్రూంలో ప్రసవించినట్లు తెలుస్తోంది.
అధికార పార్టీ వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో వైసిపి కార్యకర్తలు మనోవేదనలకు గురౌతున్నారని దర్శి వైకాపా శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. వైకాపా ప్లీనరీలో మాట్లాడిన అంశాలు నేడు నెట్టింట ట్రోల్ అవుతున్నాయి.
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూళ్లూరుపేట పురపాలక సంఘ పరిధిలో అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు.
పంపుడు స్టోరేజి ప్లాంట్స్ (పిఎస్పీ) స్కీం కింద కడపకు చెందిన సీఎం జగన్ బినామీ కంపెనీ షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ కు వందల ఎకరాల భూమి ధారదత్తం చేశారని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ రుజువులతో మీడియాకు చూపించారు.
ఒక రూమ్ కు లాక్ వేసి మరో రూమ్ లోని మహిళ పై దాడి. చడ్డీ గ్యాంగ్ పనిగా అనుమానిస్తున్న పోలీసులు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది నవంబర్ 11న ఏపీలోని విశాఖపట్టణంలో పర్యటిస్తారు.
సీనియర్ సెటిజన్లు, దివ్యాంగులకు తితితే శుభవార్తను అందించింది. నవంబర్ నెలలో వారి కోటాలోని శ్రీవారి దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ బుక్ చేసుకొనేందుకు వివరాలను తెలిపింది. అక్టోబర్ 26 మద్యాహ్నం 3గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
పొలం కూలీలపై తేనిటీగలు దాడి చేశాయి. ఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకొనింది.
పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు ఓ బాలిక మరియు ఆమె బంధువులపై విచక్షాణారహితంగా కర్రలు, రాళ్లతో బాలిక దాడిచేశాడు. ఈ ఘటనలో బాలిక సహా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
ఎన్టీఆర్ జిల్లాలో దొంగలు పడ్డారు. ఓ సెల్ ఫోన్ దుకాణంలో భారీ ఛోరీకి పాల్పొడ్డారు. సమాచారం మేరకు తిరువూరు పట్టణం మెయిన్ రోడ్డులోని బిగ్ సి షాపును యధావిధిగా రాత్రికి తాళాలు వేశారు. గుడ్డ పలుగులతో షట్టర్ తాళాలు పగలగొట్టిన గుర్తు తెలియని దొంగలు దుకాణాన్ని లూటీ చేశారు.