Home / Andhra Pradesh
ఏపీలో పోలీసులు ప్రభుత్వ పోలిసింగ్ గా మారారని ఆరోపిస్తున్న ప్రతిపక్షాల వ్యాఖ్యలను నిజమేనని అనుకొనేలా కొన్ని సంఘటనలు అద్దం పడుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన కార్యకర్తలపై పోలీసులు కక్షపూరితంగా వ్యవహరించారు.
వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు పొందిన మంత్రి రోజాకు ఇంటిపోరు మాత్రం తప్పడం లేదు. సీఎం జగన్కు సన్నిహితురాలిగా పేరుపొందిన ఆమె, రాజకీయ పరిస్థితి పైకి బాగానే ఉన్నట్టుగా కనిపిస్తున్నా, సొంత నియోజకవర్గం నగరిలో మాత్రం ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తమిళనాడు మీదుగా ఏపీ, తెలంగాణ ప్రాంతాలకు సరఫరా చేస్తున్న అక్రమ బంగారు వ్యాపారులపై కస్టమ్స్ అధికారులు దాడులు చేశారు. దీంతో 11కోట్ల రూపాయలు విలువచేసే బంగారం, నగదును అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.
ఇటీవల వివాదాలతో వార్తల్లో కెక్కిన వైసీపీ నేత, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గురువారం టీచర్ అవతారం ఎత్తారు. మేడికొండూరు జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పాఠాలు చెప్పారు.
పోలీసులు ఆ జంటకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు రెడీ అయినారు. ఇంతలో హఠాత్తుగా ఆ వివాహిత క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకొనింది. ఈ ఘటన విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీ పోలీసు స్టేషన్ లో చోటుచేసుకొనింది.
ఏపీ హైకోర్టు అనుమతితో అమరావతి టు అరసువల్లి కి చేపట్టిన రాజధాని రైతుల జేఎసి పాదయాత్రను పదే పదే వైకాపా నేతలు అడ్డుకోవడంపై రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు.
మాజీ శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో తణుకు వైకాపా నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ మేరకు తేతల్లి, సూరంపూడి గ్రామాలకు చెందిన 100మంది వైకాపాకు చెందిన నాయకులు, కార్యకర్తలను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ ఖండువ కప్పి సాదరంగా వారిని ఆహ్వానించారు.
ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన కోడికత్తి హత్యాయత్నం కేసులో నిందుతుడుగా ఉన్న జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ కోసం అతని తల్లి నిరాహారదీక్ష చేపట్టనుంది. ఈ నెల 25న తాడేపల్లిలోని సీఎం కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టేందుకు ఆమె సమాయత్తమౌతుంది.
తిరుమల తిరుపతి దేవస్ధానం భక్తులకు శుభవార్త. డిసెంబర్ నెలకు సంబంధించి ఆర్జిత సేవలను ఈ నెల 21 నుండి టిటిడి ఆన్ లైన్ విధానంలో నమోదు చేసుకోవచ్చని తితిదే ప్రకటించింది.
చిలకలూరిపేట నియోజకవర్గ రైతులను పరామర్శించే కార్యక్రమంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఓ కాలువను అలోవకగా దాటేశారు. ఆ ఫోటో కాస్తా నెట్టింట వైరల్ గా మారింది.