Last Updated:

KKR vs RCB IPL 2025: ఐపీఎల్ వేళ వెదర్ రిపోర్ట్ కీలక అప్డేట్.. తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు లేనట్టే!

KKR vs RCB IPL 2025: ఐపీఎల్ వేళ వెదర్ రిపోర్ట్ కీలక అప్డేట్.. తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు లేనట్టే!

RCB VS KKR IPL 2025 Kolkata Eden Gardens Weather Report: ఐపీఎల్ 2025 మెగా టోర్నీకి అంతా సిద్ధమైంది. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. అయితే గత రెండు రోజులుగా ఓ వార్త వైరల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందని వాతావరణశాఖ తెలపడంతో అందరూ నిరాశకు గురయ్యారు. ఐపీఎల్ తొలి మ్యాచ్ ఎక్కడ రద్దు అవుతుందనే ఆందోళన క్రికెటర్లతో పాటు అభిమానుల్లోనూ నెలకొంది.

 

అయితే తాజాగా, వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వర్షం పడే అవకాశం లేదని, కనీసం చినుకులు కూడా పడవని చెప్పింది. కావున ఈ మ్యాచ్‌కు ఎలాంటి ఆటంకం ఉండదని, మ్యాచ్ సాఫీగా సాగుతుందని ఆక్యూ వెదర్ రిపోర్ట్ వివరించింది. ప్రస్తుతం వాతావరణం పొడిగానే ఉన్నా.. సాయంత్రం వరకు ఆకాశంలో మబ్బులు ఉండే అవకాశం ఉంది. కాగా, మ్యాచ్ ప్రారంభ సమయానికి వెదర్ ఏ విధంగా ఉంటుందో ఆక్యూ వెదర్ ఓ అంచనాకు వచ్చింది.

 

ఇదిలా ఉండగా, సాయంత్రం 4 గంటల వరకు వెదర్ రిపోర్టు ప్రకారం.. కోల్‌కతాలో క్లౌడ్‌గా ఉన్నా.. వాతావరణం పొడిగానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, సాయంత్రం 6 గంటల సమయంలో ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు వర్షం ఆటంకం ఉండకపోవచ్చని తెలిపింది. రాత్రి 7 గంటల సమయంలో టాస్ వేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కూడా మబ్బులు ఉన్నా వర్షం పడకపోవచ్చని తెలిపింది. రాత్రి 12 గంటల వరకు వాతావరణం పొడిగానే ఉంది. దీంతో ఆక్యూ వెదర్ నివేదిక ప్రకారం.. మ్యాచ్ ముగిసేవరకు వర్షం పడే అవకాశం లేకపోవడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.