Home / క్రీడలు
Rishabh Pant Makes History, Breaks Iyer’s Rs 26.75 Crore: ఐపీఎల్ మెగా వేలం కొనసాగుతోంది. ఈ మెగా వేలంలో ఐపీఎల్ చరిత్రలోనే రిషబ్ పంత్ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. అంతకుముందు పంజాబ్ కింగ్స్.. శ్రేయస్ అయ్యర్‌ను అత్యధిక ధర రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. అయితే ఈ రికార్డు నమోదైన కాసేపటికే.. లక్నో బ్రేక్ చేసింది. రిషబ్ పంత్‌ను ఏకంగా రూ.27 కోట్లకు దక్కించుకుంది. అలాగే ఈ వేలంలో బట్లర్‌ను రూ.15.75కోట్లకు గుజరాత్ దక్కించుకుంది. గతేడాది […]
Shreyas Iyer Becomes Most Expensive Player Ever in IPL: ఐపీఎల్ మెగా వేలం మొదలైంది. ఈ వేలంలో మొత్తం 577 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ వేలం ధరలో శ్రేయస్ అయ్యర్‌కు అత్యధికంగా ధర పలికాడు. ఐపీఎల్ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు ధరకు పలకడం విశేషం. శ్రేయస్ అయ్యర్‌ను రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఈ ధరతో గతేడాది ఉన్న రికార్డు బద్దలైంది. అంతకుముందు స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.24.75 కోట్లకు […]
Australia vs India match Australia in trouble after losing 3 wickets: ఆస్ట్రేలియా వేదికగా పెర్త్ స్టేడియంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తడబడింది. భారత్ బౌలర్లు బుమ్రా, సిరాజ్ దెబ్బకు కేవలం 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ మెక్స్వినీ(0) డకౌట్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత నైట్ […]
Yashasvi Jaiswal breaks records: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ పేరిట అరుదైన రికార్డు నమోదైంది. తొలి టెస్టు మ్యాచ్‌లోనే యశస్వీ జైస్వాల్ సెంచరీ బాదాడు. దీంతో పలు రికార్డుల తన ఖాతాలో వేసుకున్నాడు. 23 ఏళ్లకే టెస్ట్ మ్యాచ్‌ల్లో అత్యధిక సెంచరీలు బాదిన ఐదో భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు యశస్వీ జైస్వాల్ నాలుగు సెంచరీలు సాధించగా..అంతకుముందు ఉన్న గవాస్కర్(4) రికార్డును సమం […]
Australia vs India 1st test match Rahul, Jaiswal push India’s lead: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటుతో తడబడినా, రెండో ఇన్నింగ్స్‌లో సత్తా చాటుతోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (90 బ్యాటింగ్; 193 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (62 బ్యాటింగ్; […]
Australia vs India 1st Test Border Gavaskar Trophy: ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా భారత్ టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. దీంతో భారత్ 150 పరుగులకే ఆలౌట్ అయింది. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి(41) పరుగులతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్ డకౌట్‌గా వెనుదిరిగారు. విరాట్ కోహ్లీ కేవలం 5 పరుగులకే కీపర్‌కు […]
Australia vs India Border- Gavaskar Trophy first match: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్, గావస్కర్ ట్రోఫీ జరుగుతోంది. పెర్త్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ప్రారంభంలోనే పెద్ద షాక్ తగిలింది. ఆసీస్ బౌలింగ్‌కు భారత బ్యాటర్లు బెంబేలెత్తారు. టాప్ ఆర్డర్ కనీసం బాల్ టచ్ చేసేందుకు సైతం సాహసం చేయలేకపోయింది. దీంతో తొలి సెషన్లో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. ఓపెనర్ యశస్వి […]
Border-Gavaskar Trophy series: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో శుక్రవారం పెర్త్‌లో తొలి టెస్టు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. కాగా, ఈసారి రోహిత్ శర్మ గైర్హాజరు నేపథ్యంలో ఆ టెస్టు మ్యాచ్‌కు బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడాడు. కెప్టెన్సీని ఓ పోస్టుగా భావించడం లేదని, బాధ్యతలను ప్రేమిస్తానని, కఠినమైన పని చేయడం చిన్నపటి నుంచి అలవాటు అని, కఠిన పరిస్థితుల్ని ఎదుర్కోవడం సమస్య కాదు అని, దీన్ని ఒక కొత్త […]
India beat China to retain Womens Asian Champions Trophy title: భారత మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆసియా కప్ టైటిల్‌ని నెగ్గింది. బుధవారం బీహార్ స్పోర్ట్స్ యూనివర్సిటీ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగింది. ఫైనల్లో భారత్‌కు చైనా గట్టి పోటీ ఇచ్చింది. మూడో క్వార్టర్స్‌లో దీపికా గోల్ చేసి భారత్‌ను ఆధిత్యంలో వెళ్లేలా చేసింది. మూడో క్వార్టర్‌లోనే భారత్‌కు ఆధిక్యాన్ని రెట్టింపు […]
Satwik-Chirag back on circuit: గాయం కారణంగా ఆటకు దూరమైన భారత డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి.. చైనా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో తిరిగి రంగంలోకి దిగారు. సాత్విక్ భుజానికి గాయం కారణంగా పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఈ జోడీ ఆ తర్వాత జరిగిన ఆర్కిటిక్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, చైనా ఓపెన్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలకు దూరమైంది. కాగా, గాయం నుంచి సాత్విక్ కోలుకోవడంతో మంగళవారం వీరిద్దరూ చైనా […]